మెగాస్టార్ ని ఒణికించిన `గాడ్ ఫాద‌ర్` స‌క్సెస్ టెన్ష‌న్!

Update: 2022-10-09 04:27 GMT
మెగాస్టార్ చిరంజీవి కథానాయ‌కుడిగా న‌టించిన `గాడ్ ఫాద‌ర్` ఇటీవ‌ల రిలీజ్ అయి ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. మెగాస్టార్ దెబ్బ‌కి మ‌రోసారి బాక్సాఫీస్ మోతెక్కిపోతుంది. ఆచార్య ప్లాప్ లో తీవ్ర నిరుత్సాహంలో కూరుకుపోయినా మెగా ఫ్యామిలీనీ  `గాడ్ ఫాద‌ర్` స‌క్సెస్ బ‌య‌ట ప‌డేలా చేసింది.  మెగా అభిమానులు ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు.

రెట్టించిన ఉత్సాహంతో సంతోషాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంటున్నారు. తాజాగా గాడ్ ఫాద‌ర్  విజ‌యోత్స‌వంలో  భాగంగా నిర్వ‌హించిన స‌మావేశంలో మెగాస్టార్ సినిమా గురించి త‌న అనుభ‌వాల్ని పంచుకున్నారు. ఆ వేంటో ఆయ‌న మాట‌ల్లోనే..  

' సినిమా రిలీజ్ కి ముందు మొదట్లో కాన్ఫిడెంట్‌గా ఉన్నా.  కానీ ముందు రోజు రాత్రి సురేఖ చాలా డల్‌గా ఉంది. ఆమెని చూస్తుంటే లోలోపల కుంగిపోయాను. సినిమా బాగుంటుందని అనుకున్నప్పుడు గతంలో జరిగిన అవాంఛనీయ సంఘటనలను గుర్తొకొచ్చాయి.. ఆఖరి నిమిషంలో ఏం జరుగుతుందో? తెలియని ఒక రకమైన భయం మమ్మల్ని చుట్టుముట్టింది.

ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఉదయాన్నే లండన్ షోల నుండి మంచి రిపోర్ట్స్ వస్తున్నాయని నిర్మాత నుండి కాల్ చేసి చెప్పారు.  నా లుక్.. వేషధారణ.. వాకింగ్ స్టైల్  చాలా బాగుందని యుఎస్ నుండి నాకు ఓ  సన్నిహితుడు ఫోన్ చేసి చెప్పాడు. కానీ  అసలు సినిమా ఎలా ఉందనే దాని గురించి అతను మాట్లాడకపోవడంతో  నేను మరింత ఆందోళన చెందాను.

అనిల్ సుంకర .. మైత్రి  మూవీ మేక‌ర్స్ నవీన్ నుండి సినిమా అద్భుతంగా ఉందని.. అన్ని మూలల నుండి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయని నాకు కాల్స్ వచ్చిన తర్వాత మాత్రమే నేను ఉపశమనం పొందాను. సినిమా గురించి అసలు టాక్‌ని గ్రహించకముందు ఆ గంట‌లో నేను ఒణికిపోయాను. గాడ్‌ఫాదర్‌ సక్సెస్‌ అని తెలుసుకున్న తర్వాత  ప్రశాంతంగా.. నిగూఢంగా ఉన్నాను.

క‌ష్టానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కితే అది  ఓ అందమైన అనుభూతి. నా జీవితంలో అద్భుత‌మైన 15 చిత్రాల్లో గాడ్ పాద‌ర్ ఒక‌టిగా నిలిచింది. ఇంద్ర‌..ఠాగూర్ త‌ర్వాత ఆ స్థాయి విజ‌యం అంటుంటే ఆనందంగా ఉంది.  కంటెంట్ బాగుంటు జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌స్తార‌ని చెప్పింది నేనే.  ఈ సినిమాతో ఆ న‌మ్మ‌కం నిజ‌మైంది. పారితోషికం కోసం ఎవ‌రూ ప‌నిచేయ‌లేదు. విజ‌యం కోస‌మే ప‌నిచేసాం. స‌ల్మాన్ ఖాన్ నా కోసం ఎలాంటి పారితోషికం తీసుకోకుండా చేసారు. దానికి ప‌రిహారం మ‌రో రూపంలో చ‌ర‌ణ్ చెల్లిస్తాడు. సినిమా పై మేం న‌మ్మ‌కం ఉన్నా మీడియా ర‌క‌ర‌కాల వార్తలొచ్చాయి.  మేం ఏం చేయాలో కూడా మీడియానే నిర్దేశిస్తుంటే చికాకు గా అనిపిస్తుంద‌`న్నారు.
Tags:    

Similar News