ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం 'ఎఫ్ 2'. అందులో నటించిన హీరోలకు హీరోయిన్లకు అందరికీ మంచి బూస్ట్ ఇచ్చింది. ముఖ్యంగా వరస ఫ్లాపులతో సతమతమవుతున్న హీరోయిన్లు తమన్నా.. మెహ్రీన్ లు ఇద్దరికీ ఈ సినిమా హిట్ పెద్ద రిలీఫ్ ఇచ్చింది. 'F2' రిలీజ్ కు ముందు తమన్నాకు కనీసం ఒకటి అరా ఆఫర్లు ఉన్నాయి కానీ మెహ్రీన్ కు అవి కూడా లేవు. అయితే 'ఎఫ్ 2' సక్సెస్ తర్వాత మెహ్రీన్ కు మళ్ళీ ఆఫర్ల వెల్లువ మొదలైందట.
ఇప్పటికే తమిళ దర్శకుడు తిరు- గోపిచంద్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికయింది. ఈ సినిమానే కాదు నందమూరి బాలకృష్ణ - కెయస్ రవి కుమార్ కాంబినేషన్ లో పట్టాలెక్కబోతున్న కొత్త సినిమాకు మెహ్రీన్ ను హీరోయిన్ గా తీసుకునేందుకు చర్చలు సాగుతున్నాయట. అంతా సవ్యంగా జరిగితే బాలయ్య - మెహ్రీన్ జోడీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతారు. సీనియర్ హీరోలకు హీరోయిన్లను వెతకడం ఈమధ్య కష్టంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో నిర్మాతలు కాస్త ఎక్కువ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి మరీ హీరోయిన్ ను ఫైనలైజ్ చేసుకుంటున్నారు. ఈ లెక్కన మెహ్రీన్ కు మంచి ఆఫర్ దొరికినట్టే. మరోవైపు సరైన జోడీ దొరక్క ఇబ్బంది పడుతున్న బాలయ్యకు కూడా సూపర్ జోడీ దొరికినట్టు.
'ఎఫ్ 2' కు ముందు ఆఫర్లు లేక ఇబ్బంది పడిన మెహ్రీన్ కు ఇప్పుడు వరసబెట్టి ఆఫర్లు రావడం గొప్ప విషయమే. చేతికి వచ్చిన ఆఫర్లను దొరకబుచ్చుకుని సత్తా చాటితే మెహ్రీన్ కెరీర్ మరో రెండు మూడేళ్ళ పాటు ఢోకా ఉండదు.