టీమిండియా కెప్టెన్ ధోనీ బయోపిక్ రెడీ అవుతోంది. డైరెక్టర్ నీరజ్ పాండే ఆ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ధోనీపై సినిమా అనగానే పండుగ చేసుకుంటున్న అభిమానులు సినిమాకు సంబంధించిన ఒక్కో విషయం తెలుసుకుంటూ మరింత ఆసక్తి పెంచుకుంటున్నారు. అయితే.. తాజాగా తెలిసిన ఓ విషయం మాత్రం ధోనీ అభిమానులందరినీ కన్నీళ్లు పెట్టిస్తోందట. ధోనీ జీవితంలో ఓ ప్రేమకథ ఉందని తెలిసి తొలుత అంతా సరదా పడినా అది విషాదాంతమైందని తెలుసుకుని షాక్ తింటున్నారు.
ధోనీ జీవితంలో అంత సీరియస్ లవ్ స్టోరీ ఉందన్న విషయం ఇంతవరకు అభిమానులకు కూడా తెలియదు. కానీ.. అది నిజమట. ధోనీకి 20 ఏళ్ల వయసున్నప్పుడు ప్రియాంక ఝా అనే యువతితో లవ్ లో పడ్డాడు. ఆమెతోనే జీవితం పంచుకోవాలనుకున్నాడు. కానీ... ప్రియాంక ఓ యాక్సిడెంట్ లో చనిపోయింది. దీంతో ధోనీ పూర్తిగా డిప్రెషన్ కు లోనయిపోయాడట. ఏడాది పాటు పిచ్చోడిలా మారిపోయాడట. క్రికెట్ పట్ల కూడా ఆసక్తి లేకుండా ఆమె ధ్యాసలో పడి పిచ్చోడయ్యాడట. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి ఆయనకు ఏడాదికిపైగా సమయం పట్టిందట. ధోనీ పరిస్థితి చూసి ఆయన తల్లిదండ్రులు చలించిపోయి మళ్లీ ఆయన్ను మామూలు మనిషిని చేయడానికి చాలా ప్రయత్నాుల చేశారట. అవన్నీ ఫలించి ఈ జార్ఖండ్ డైనమైట్ మళ్లీ బ్యాటు పట్టాడు.
ధోనీ సన్నిహితులకు మాత్రమే తెలిసిన ఈ విషయం ఇప్పుడు ఆయన జీవిత కథ వల్ల అందరికీ తెలుస్తోంది. తన లవ్ స్టోరీని సినిమాలో చూపించేందుకు ధోనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మైదానంలో ఎంతో కఠినంగా కనిపించే ధోనీ జీవితంలో ఇంత విషాదం ఉందా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.