భయపెడుతున్న నయనతార.. దొరా!!

Update: 2016-12-16 13:02 GMT
మలయాళీ బ్యూటీ నయనతారకు సింగిల్ హ్యండ్ తో సినిమాలు లీడ్ చేయడం కొత్తేమీ కాదు. పక్కన ఎలాంటి స్టార్ ఉన్నా తన పాత్రతో మెప్పించేయడం.. తను కనిపిస్తే చాలు బ్లాక్ బస్టర్ అయ్యేలా సబ్జెక్టులు సెలక్ట్ చేసుకోవడం నయన్ బాగా ట్యాలెంటెడ్. ఇప్పుడు నయన్ నటిస్తున్న ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ దొరా.

గతంలో మాయ అనే హారర్ మూవీతో మెప్పించిన నయనతార.. ఈసారి దొరా అంటూ ప్రేక్షకుల ముందుక రానుండగా.. ఇప్పుడా సినిమాకి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మూడు నెలల క్రితం మొదట విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ లో.. కారుకు అడ్డంగా నిలబడ్డ ఓ అమ్మాయిని చూపిస్తే.. ఆ తర్వాత అదే విజువల్ ని కారులోంచి చూస్తే ఎలా ఉంటుందో చూపించారు. ఒక వ్యక్తి కారు తోలుతున్న విషయాన్ని రియర్ వ్యూ మిర్రర్ లోంచి చూపించగా.. ఎదురుగా ఒక సగం అందంగా.. మరోసగం భయంకరంగా కనిపిస్తున్న నయన్ ఈ పోస్టర్ లో కనిపిస్తుంది. అద్దం మీద 'షి కమింగ్ సూన్' అని రాసిన కాన్సెప్ట్ అయితే సూపర్ అంతే.

తాజాగా రిలీజ్ చేసిన.. 'ఎంగ పోరా ఎంగపోరా' సాంగ్ చాలా బాగుందనే టాక్ తెచ్చుకుంది. దీంతో పాటే ఇప్పుడు దొరా కు మరో పోస్టర్ రిలీజ్ అయింది. ఇందులో తలంతా రక్తం కారుతుండగా.. కారు తోలేస్తున్న నయనతార కనిపిస్తుంది. సాంగ్ రిలీజ్ సందర్భంగా దొరా పోస్టర్ చూస్తుంటేనే మరోసారి కూడా తన నటనతో భయపెట్టేసి నయనతార మాయ చేసేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News