ఎట్ట‌కేల‌కు NC22 కీల‌క ఘ‌ట్టం ముగించారు!

Update: 2022-10-21 09:30 GMT
`బంగార్రాజు` మూవీతో ఫ‌రావాలేద‌నిపించుకున్న నాగ‌చైత‌న్య ఆ త‌రువాత  బ్యాక్ టు బ్యాక్ రెండు క్రేజీ సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. `మ‌నం` ఫేమ్ విక్ర‌మ్ కె. కుమార్ డైరెక్ష‌న్ లో `థ్యాంక్యూ` మూవీ చేశాడు. దీనికి `ప్రేమ‌మ్‌` మూవీకి ద‌గ్గ‌రి పోలిక‌లు వుండ‌టంతో ప్రేక్ష‌కులు ఈ మూవీని తిర‌స్క‌రించారు. దీంతో చైతూ భారీ ఆశ‌లు పెట్టుకున్న ఈ మూవీ డిజాస్ట‌ర్ అనిపించుకుంది. ఆ త‌రువాత బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ తో క‌లిసి న‌టించిన తొలి బాలీవుడ్ మూవీ `లాల్ సింగ్ చ‌డ్డా` కూడా ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక షాకిచ్చింది.

బ్యాక్ టు బ్యాక్ రెండు డిజాస్ట‌ర్ ల త‌రువాత నాగ‌చైత‌న్య కొత్త ప్రాజెక్ట్ కు శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే. త‌మిళ ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు డైరెక్ష‌న్ లో ఈ మూవీని తెలుగు, త‌మిళ భాష‌ల్లో ద్విభాషా చిత్రంగా తెర‌కెక్కిస్తున్నారు. శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పై శ్రీ‌నివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా బేబ‌మ్మ కృతిశెట్టి న‌టిస్తోంది.ఇటీవ‌లే రెగ్యుల‌ర్ షూటింగ్ ని ప్రారంభించారు. క‌ర్ణాట‌క‌లోని  మైసూర్ లో ఇటీవ‌ల కీల‌క ఘ‌ట్టాల షూటింగ్ ని మొద‌లు పెట్టారు.  

మాండ్య జిల్లాలోని మేలుకోట స‌మీపంలో షూటింగ్ చేశారు. అయితే అక్క‌డ రాజ‌గోపురం త‌ర‌హాలో ఓ బార్ సెట్ ని నిర్మించి షూటింగ్ చేస్తున్నార‌ని స్థానిక నాయ‌కులు అడ్డు త‌గ‌ల‌డంతో ఈ మూవీ షూటింగ్ కి అంత‌రాయం ఏర్ప‌డింద‌నే వార్త‌లు వినిపించాయి.

అయితే ఆ అడ్డంకుల్ని విజ‌య‌వంతంగా అధిగ‌మించిన చిత్ర బృందం మైసూర్ లోని సుంద‌ర ప్ర‌దేశాల్లో కీల‌క ఘ‌ట్టాల‌ని పూర్తి చేసిన‌ట్టుగా చిత్ర బృందం తాజాగా వెల్ల‌డించింది.

ఈ షెడ్యూల్ లో హీరో నాగ‌చైత‌న్య పాల్గొన‌గా కీల‌క స‌న్నివేశాల‌ని పూర్తి చేశార‌ట‌. ఈ మూవీలో నాగ‌చైత‌న్య ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా క‌నిపించ‌నున్నారు. త‌న కెరీర్ లో అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ద్విభాషా చిత్రంగా తెర‌కెక్కుతున్న మూవీ ఇదే కావ‌డం విశేషం. ఈ సినిమాకు తొలిసారి లెజెండ‌రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఇళ‌య‌రాజా త‌న త‌న‌యుడు యువ‌న్ శంక‌ర్ రాజాతో క‌లిసి ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. అబ్బూరి ర‌వి మాట‌లు, ఉస్‌.ఆర్ క‌ధీర్ ఈ మూవీకి సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News