ఎన్టీఆర్ కథానాయకుడు ఇచ్చిన షాక్ నుంచి త్వరగానే కోలుకుని బాలయ్య టీమ్ మహానాయకుడుని తీసుకొస్తోంది. ఉదయం ట్రైలర్ రిలీజ్ తాలూకు పోస్టర్స్ లో అతి త్వరలో విడుదల అని కొంత అయోమయం రేపినప్పటికీ ఫైనల్ గా 22 డేట్ నే ఫిక్స్ అయ్యారు. ఇవాళ సెన్సార్ ఫార్మాలిటీ కూడా పూర్తి చేసారు. క్లీన్ యుతో సభ్యులు దీనికి ఎలాంటి అభ్యంతరం తెలుపలేదు. అయితే రన్ టైం మాత్రం ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సుమారుగా అరగంటకు పైగా తగ్గడం గమనార్హం.
కథానాయకుడు 2 గంటల 45 నిమిషాల దాకా ఉండగా మహానాయకుడు కేవలం 2 గంటల 8 నిముషాలు మాత్రమే వచ్చిందట. పాటలు మాస్ మసాలాలు ఏమి లేకుండా కేవలం ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని మాత్రమే నేపధ్యంగా తీసుకున్నారు కాబట్టి లెన్త్ గణనీయంగా తగ్గిపోయింది. ఇది ఒకందుకు మంచిదే. కథానాయకుడులో అనవసరమైన ప్రహసనాలకు చోటివ్వడం వల్లే ప్రేక్షకులు అసహనంగా ఫీలయ్యారని వచ్చిన రిపోర్ట్స్ ని క్రిష్ సీరియస్ గా తీసుకున్నాడు. అందుకే మహానాయకుడులో అలాంటి కామెంట్స్ కి చోటు లేకుండా జాగ్రత్త పడినట్టు తెలిసింది.
ఇప్పటికే కొత్త పోస్టర్లతో కాస్త యాక్టివ్ గా కనపడుతోంది పబ్లిసిటీ. టైం చాలా తక్కువగా ఉండటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసే అవకాశాల గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈసారి రానా బాగా హై లైట్ అవుతుండటం ఇప్పటికే చర్చలో ఉంది. తెలుగుదేశం పార్టీ స్థాపన మొదలుకుని రెండు సార్లు ఎన్టీఆర్ అధికార పీఠం మీద కూర్చోవడం దాకా కవర్ చేసి బసవతారకం నిర్యాణంతో క్లైమాక్స్ ముగించారని ఇన్ సైడ్ టాక్. ఇంకో ఆరు రోజుల్లో మరోసారి ఎన్టీఆర్ రూపంలో బాలయ్య దర్శనం జరగడం ఖాయమని తేలిపోయింది