పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు. ఓ పది రోజుల క్రితం వరకూ అసలు ఈ సినిమాపై ఎలాంటి బజ్ కానీ.. క్యూరియాసిటీ కానీ.. ఎక్స్ పెక్టేషన్స్ కానీ లేవు. పవన్ కళ్యాణ్.. శృతి హాసన్ తప్ప మరే అట్రాక్షన్ లేదు. దీంతో బిజినెస్ వర్గాలు కూడా ఆసక్తి చూపలేదు. కానీ 30 సెకన్ల నిడివి గల కాటమరాయుడు టీజర్ మొత్తం లెక్కలన్నీ మార్చేసింది. పవన్ కళ్యాణ్ తన యాక్షన్ పవర్ ను చూపించి విధానానికి.. ఇప్పుడు బయ్యర్స్ అందరూ క్యూ కట్టేస్తున్నారు.
కళ్లు చెదిరిపోయే రీతిలో కాటమరాయుడు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్స్ స్థాయిలో.. పవన్ కళ్యాణ్ మూవీస్ లో అన్నిటి కంటే ఎక్కువగా ఈ సినిమాపై డబ్బులు పెట్టేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. నైజాం హక్కులను నితిన్ అండ్ ఏషియన్ ఫిలిమ్స్ కలిసి 20 కోట్ల రూపాయలకు దక్కించుకోగా.. సీడెడ్ రైట్స్ ఏకంగా 12 కోట్లు పలికాయి. ఉత్తరాంధ్ర హక్కుల రూపంలో 8.3 కోట్లు ముట్టాయి. గుంటూరు రైట్స్ కోసమే 6.5 కోట్లు దక్కాయంటే.. పవన్ పవర్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది.
ఈస్ట్ గోదావరి 5.5 కోట్లు.. వెస్ట్ 4.85 కోట్లకు సేల్ అయ్యాయని తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే.. కాటమరాయుడును 12 కోట్లకు విక్రయించగా.. ఇందులో 2 కోట్లు రిఫండబుల్. అంటే సినిమా 12 కోట్లమేర ఫేర్ చేయకపోతే.. 10 కోట్లు దాటిన మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుందన్న మాట. మొత్తంగా థియేట్రికల్ రైట్స్ రూపంలోనే పవన్ 85 కోట్లు బిజినెస్ చేసేస్తున్నాడు. ఇక శాటిలైట్.. ఇతర హక్కులు కలిపితే.. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ మూవీ కాటమరాయుడు 100 కోట్ల బిజినెస్ ను దాటేసినట్లే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/