ప‌వ‌న్ (Vs) ప్ర‌భాస్.. ఆ చిక్క‌లు త‌ప్ప‌వా?

Update: 2021-05-17 04:36 GMT
టాలీవుడ్ స్టార్ హీరోలంతా మ‌హ‌మ్మారీ సీజ‌న్ లో వ‌రుస‌గా క‌థ‌లు వింటూ ద‌ర్శ‌కుల్ని ఫైన‌ల్ చేస్తూ వీలైతే ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నారు. డార్లింగ్ ప్ర‌భాస్ (41) బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాల్ని సైమ‌ల్టేనియ‌స్ గా లాగించేయాల‌న్న ప్లాన్ తో ఉన్నారు. సెకండ్ వేవ్ ప్ర‌భావంతో షూటింగుల‌న్నీ పెండింగుల్లో ప‌డ‌డంతో తిరిగి ప్రారంభిస్తే గ్యాప్ లెస్ గా షెడ్యూల్స్ ని డిజైన్ చేస్తున్నార‌ని తెలిసింది. ఆదిపురుష్ 3డి- స‌లార్  చిత్రాల‌తో పాటు అత‌డు నాగ్ అశ్విన్ తో సినిమాని ప‌ట్టాలెక్కించేయ‌నున్నార‌ట‌.

ఇదిలా ఉంటే ఇత‌ర హీరోల‌తో పోటీప‌డుతూ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ 50 ఏజ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో న‌టించేస్తుండ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఆయ‌న మరో స‌ల్మాన్ ఖాన్ (55)లా ఎన‌ర్జిటిక్ గా ప్ర‌తిదీ ప్లాన్ చేస్తుండ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఓవైపు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు లాంటి భారీ పాన్ ఇండియా సినిమాలో న‌టిస్తున్న ప‌వ‌న్ .. అయ్య‌ప్ప‌నుమ్ కోషియం రీమేక్ లోనూ న‌టించేస్తున్నారు. సాగ‌ర్  చంద్ర ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గానే హ‌రీష్ శంక‌ర్ తో ప‌వ‌న్ 28వ సినిమా చేసేందుకు ప్లానింగ్ వేగంగా సాగుతోంది. అయితే ఒకేసారి ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ సినిమాలు చేసినప్పుడు స్టార్ల‌కు ర‌క‌ర‌కాల‌ స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు. ముఖ్యంగా తేదీలు కేటాయించ‌డం.. అలాగే పాత్ర‌కు త‌గ్గ‌ట్టు గెట‌ప్ ని మార్చ‌డం స‌మ‌స్యే. మ‌రోవైపు జ‌న‌సేనానిగా రాజ‌కీయాల్ని కూడా మ్యానేజ్ చేయాల్సి ఉంటుంది కాబ‌ట్టి అత‌డు షెడ్యూల్స్ ప‌రంగా బ్రేక్ ఇవ్వ‌డానికి ఉండ‌దు. కార‌ణం ఏదైనా కానీ ఈ తీరిక లేని షెడ్యూల్స్ ఏజ్ ప‌రంగా చూసినా అత‌డిపై తీవ్ర ఒత్తిడి పెంచ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ప్ర‌భాస్ ఇంకా 40లో ఉన్నారు కాబ‌ట్టి ఒకేసారి ఎన్ని సినిమాలైనా చేస్తారు. కానీ ప‌వ‌న్ అలా కాదు. ఆయ‌న ఏజ్ ప‌రంగా కూడా కొంత కాంప్లికేష‌న్ ఉంద‌న్న‌ది నిపుణుల‌ విశ్లేష‌ణ‌.

పవన్ మేకప్ మ్యాన్ లీక్స్ ప్రకారం.. పీఎస్ పీకే 28 కోసం పవర్ స్టార్ పూర్తిగా కొత్త గెటప్ లో కనిపించాల్సి ఉంటుంది. కొత్త రూపంతోనే చిత్రీక‌ర‌ణ ప్రారంభమవుతుందట‌. అలాంట‌ప్పుడు మూడు సినిమాల మ‌ధ్య‌ గెట‌ప్ ఛేంజ్ కోసం చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది. మ‌రి ప‌వ‌న్ ఎలా మ్యానేజ్ చేస్తార‌న్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది.
Tags:    

Similar News