ప్రకాశ్ రాజ్ మంచి ఆర్టిస్ట్ అని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన నటించిన ప్రతి భాషలోనూ పెద్ద సంఖ్యలోనే అభిమానులు ఉన్నారు. వివిధ భాషల్లో నటిస్తూ వస్తున్న ప్రకాశ్ రాజ్ కి కొన్ని భాషలపై మంచి పట్టుంటుంది. ఆయా భాషల్లోని సాహిత్యాన్ని ఆయన ఎక్కువగా చదువుతూ ఉంటారు. ఆ సాహిత్యం ప్రభావం ఆయనపై కనిపిస్తూ ఉంటుంది. అందువల్లనే సామాజిక అంశాలపై .. సమస్యలపై వెంటనే ఆయన స్పందిస్తూ ఉంటారు.
అలాగే కొన్ని కథలను తాను మాత్రమే తాను అనుకున్నట్టుగా చిత్రీకరించగలననే భావన ఆయనలో బలంగా కనిపిస్తుంది. తన అభిప్రాయాలను .. అభిరుచులను వేరే నిర్మాతలపై రుద్దే ఆలోచన ప్రకాశ్ రాజ్ కి లేదు.
అందువల్లనే తాను దర్శకత్వం వహించాలని అనుకున్న సినిమాలకి తానే నిర్మాతగా మారిపోతుంటారు. అలా ఆయన కొన్ని సినిమాలకు దర్శక నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఆ సినిమాలన్నీ రీమేక్ లు కావడం వలన .. అందరూ మెచ్చే అంశాలు వాటిలో లేనందున సరిగ్గా ఆడలేదు.
అందువలన ఇటు దర్శకుడిగాగానీ .. నిర్మాతగా గాని ప్రకాశ్ రాజ్ సక్సెస్ రాలేదు. ఆయన దర్శక నిర్మాతగా చేసిన ఏ సినిమా కూడా ఆయనకి లాభాలు తెచ్చిపెట్టలేదు. అయితే అవి డబ్బు కోసం చేసిన సినిమాలు కాదనీ .. తన ఆత్మ సంతృప్తి కోసం చేసినవని ప్రకాశ్ రాజ్ చెబుతుంటారు. నటుడిగా బిజీగా ఉండే తాను దర్శకుడిగా మారడానికి అప్పుడప్పుడు కొంత సమయాన్ని కేటాయిస్తూ ఉంటానని ప్రకాశ్ రాజ్ అంటూ ఉంటారు. అలా ఇప్పుడు ఆయన మళ్లీ మెగా ఫోన్ పట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు.
సామాజిక .. రాజకీయ అంశాలతో తాను ఒక సినిమాను రూపొందించనున్నాననీ, 'మనలో ఒకడు' అనే టైటిల్ తో ఈ సినిమా నిర్మితమవుతుందని ప్రకాశ్ రాజ్ చెప్పారు.
గతంలో ఇదే టైటిల్ తో 'ఆర్పీ పట్నాయక్ ఒక సినిమా చేశాడుగానీ .. ఆ కథ వేరు .. దాని దారి వేరు. ఇప్పుడు ప్రకాశ్ రాజ్ రెడీ చేసుకున్న కంటెంట్ వేరు. ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే చెబుతానని ఆయన అన్నారు. మరి దర్శక నిర్మాతగా ఈ సినిమాతోనైనా ఆయన సక్సెస్ ను అందుకుంటారేమో చూడాలి.