ప్రస్తుతం చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. తమ వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. టాలీవుడ్ క్యూట్ కపుల్స్ రామ్ చరణ్-ఉపాసన - నాగ చైతన్య-సమంత లు సోషల్ మీడియాలో తమ అప్ డేట్స్ ను ఎప్పటికపుడు పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అదే తరహాలో ఇద్దరు సెలబ్రిటీ కపుల్స్ మధ్య సాగిన సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్- టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాల జంట సరదాగా చేసిన ట్వీట్లకు నెటిజన్లు ఫిదా అయిపోయారు.
శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ లో ప్రదర్శనకుగానూ షోయబ్ మాలిక్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా బైక్ ను బహుకరించారు. మైదానంలో బైక్ మీద కూర్చున్న షోయబ్ ఫొటోను సానియా ట్వీట్ చేసింది. `దానిపై రైడ్ కు వెళ్దామా అంటూ భర్తను అడుగుతున్నట్లు సానియా క్యాప్షన్ పెట్టింది. దానికి మాలిక్ కూడా ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. `యస్...యస్....వెళ్దాం.. తొందరగా రెడీ అవ్వు. నేను దార్లో ఉన్నా` అని ట్వీట్ చేశాడు. తన భర్త కన్నా రెండాకులు ఎక్కువే చదివిన సానియా ఇంకా ఫన్నీగా రిప్లై ఇచ్చింది. `ఫర్వాలేదులే ....ఆల్రెడీ వెనుక సీట్లో ఎవరో కూర్చున్నారుగా` అంటూ మాలిక్ వెనుక క్రికెటర్ షాదాబ్ ఖాన్ కూర్చున్న ఫొటోను ట్వీట్ చేసింది. దానికి షోయబ్ కూడా అంతే సరదాగా బదులిచ్చాడు. ` నో..నో....అలాటిందేం లేదు. అతడిన గ్రౌండ్లోనే దింపేశా....అలాంటి వ్యవహారాలేమీ లేవు` అని మాలిక్ పోస్ట్ చేశాడు. భార్యాభర్తల మధ్య జరిగిన ట్వీట్ల సంభాషణ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. ఆ జంట హాస్యచతురతపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
లాహోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో పాకిస్థాన్ 36 పరుగుల తేడాతో గెలుపొందింది. అబుదాబీలో జరిగిన రెండు టీ20లు సహా లాహోర్ లో 8 ఏళ్ల తర్వాత జరిగిన టీ20లోనూ పాక్ జట్టే గెలుపొందింది. యూఏఈ వేదికగా శ్రీలంక - పాక్ మధ్య రెండు టెస్టులు - ఐదు వన్డేల సిరీస్ జరిగింది. టెస్టు సిరీస్ ను లంక 2-0తో గెలుపొందగా - 5 వన్డేల సిరీస్‌ను పాక్ క్లీన్ స్వీప్ చేసింది. 2009లో శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై లాహోర్లో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఉగ్రదాడుల భయంతో పెద్ద జట్టేదీ పాక్ లో పర్యటించే సాహసం చేయలేదు. ఇటీవలే వరల్డ్ ఎలెవన్ జట్టు... పాక్ లో మూడు టీ20 మ్యాచ్ లు ఆడింది. ఆ తర్వాత ఇప్పుడు శ్రీలంక ధైర్యం చేసి ఒక టీ20 మ్యాచ్ ఆడింది. అప్పుడు దాడులకు గురైన శ్రీలంక జట్టు మళ్లీ పాక్ లో ఆడడంతో అక్కడి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ మ్యాచ్ తర్వాత మిగతా పెద్ద జట్లుకూడా తమ దేశంలో క్రికెట్ ఆడేందుకు వస్తాయని ఆశిస్తున్నారు.