మురగదాస్​ సార్​.. ఈసారి ఏం చేస్తారో..

Update: 2023-07-01 14:04 GMT
ఒకప్పుడు వరుస చిత్రాలతో బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌కు కొంతకాలంగా సమయం కలిసి రావట్లేదు. ఆయన నిర్మాతగా, రైటర్​, దర్శకుడిగా అన్నింటిల్లోనూ ఫెయిల్ అవుతూ వస్తున్నారు. అభిమానుల్ని నిరుత్సాహపరుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయనతో ఓ హీరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్​ ఇచ్చారు. ఆ వివరాలు..  

గతంలో వరుస చిత్రాలతో బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు క్రియేట్ చేసిన దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌. భారతీయ సినిమా రూ.100కోట్ల వసూళ్లు సాధిస్తుందా? అనుకునే రోజుల్లోనే 'గజనీ'తో అదిరిపోయే సమాధానం చెప్పారాయన.  'గజని', 'తుపాకీ' వంటి సక్సెస్​ ఫుల్ మూవీస్​తో తమిళంతో పాటు తెలుగు వారికీ దగ్గరయ్యారు. ఇంకా చెప్పాలంటే ఆయనలో గొప్ప దర్శకుడే కాదు.. అద్భుతమైన నటుడుతో పాటు మరీ ముఖ్యంగా రైటర్ కూడా ఉన్నారు.

మరి అంతటి స్టార్‌ డైరెక్టర్‌, ట్రాక్​ రికార్డ్​ అయిన ఆయనకు ఈ మధ్య కాలం కలిసి రావట్లేదను.  వరుసగా పరాజయాలను అందుకుంటున్నారు. అప్పట్లో తెలుగులో ఆయన చిరుతో రూపొందించినా 'స్టాలిన్' అంతగా అద్భుతాలు చేయనప్పటికీ..  'స్పైడర్​' చిత్రం డిజాస్టర్​ రిజల్ట్​తో తెలుగు వారికి మరింతగా గుర్తిండిపోయారు. ​

ఆయన చివరగా తమిళంలో  దర్శకత్వం వహించినా రజనీకాంత్‌ 'దర్బార్‌' కూడా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో ఆయన  నిర్మాతగా మారి '1947 ఆగస్టు 16' తీశారు. అదీ బోల్తా కొట్టింది. ఇక సీనియర్ హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రలో  రూపొందిన 'రంగీ'కి కథ అందిస్తే అది కూడా నిరుత్సాహ పరిచింది.  

అలా మూడేళ్ల నుంచి ఒక్క సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఓ హీరోతో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. ఆయనే శివ కార్తికేయన్. ప్రస్తుతం మీడియం బడ్జెట్​ హీరోగా మంచి మార్కెట్​ ఉన్న హీరోగా కెరీర్​లో రాణిస్తున్న ఆయనతో ఓ పాన్​ ఇండియా సినిమా చేయనున్నారని చెన్నై టాక్. హీరోయిన్​గా మృణాల్ ఠాకూర్ పేరు పరిశీలనలో ఉందట. దాదాపుగా ఆమె కన్ఫామ్​ అయినట్లు తెలుస్తోంది. సంగీత దర్శకుడిగా అనిరుద్ రవిచందర్ తీసుకుంటున్నారట. పీరియాడిక్ డ్రామా బ్యాక్​డ్రాప్​లో ఓ వైవిధ్యమైన పాయింట్​తో దీన్ని రూపొందించబోతున్నట్లు తెలిసింది.

మరి ప్రస్తుతం వరుస పరాజయాలను అందుకుంటున్న మురగదాస్​కు ఇప్పుడు గట్టి కమ్ బ్యాక్​  చాలా అవసరం. ఇలాంటి సందర్భాల్లో మంచి మార్కెట్​ ఉన్న హీరోనే దొరికారు. మరి ఆయన.. ఈ అవకాశాన్ని వినియోగించుకుని గట్టి కమ్​ బ్యాక్ ఇస్తారా? లేదా మళ్లీ బాక్సాఫీస్​ ముందు తుస్సు మనిపిస్తారా?  అనేది ప్రస్తుతం సినీ ప్రియుల్లో ఆసక్తిగా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Similar News