హీరోగా నిలదొక్కుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు తారకరత్న. కానీ ఇప్పటిదాకా ఒక్క సక్సెస్ కూడా అందుకోలేకపోయాడు. కానీ ‘అమరావతి’ సినిమా కోసం విలన్ అవతారం ఎత్తి మంచి పేరు సంపాదించాడు. ఆ సినిమాకు నంది అవార్డు కూడా అందుకున్నాడు. ఇప్పుడు నారా రోహిత్ మూవీ ‘రాజా చెయ్యి వేస్తే’లో మరోసారి విలన్ గా కనిపించబోతున్నాడు. ‘అమరావతి’ సినిమా చేసేటపుడే తన పాత్రకు అవార్డు వస్తుందని అంచనా వేశామని.. ‘రాజా చెయ్యి వేస్తే’లో తన పాత్రకు కూడా అలాంటి గుర్తింపే వస్తుందని తారకరత్న చెప్పాడు. ‘‘అమరావతి సినిమా చేస్తున్నప్పుడే డైరెక్టర్ రవిబాబు గారు నా పాత్రకు అవార్డు వస్తుందని చెప్పారు. నాకూ ఆ నమ్మకం కలిగింది. ఆయన చెప్పినట్లే అవార్డు వచ్చింది. ఆ క్రెడిట్ అంతా ఆయనకే చెందుతుంది. ‘రాజా చెయ్యి వేస్తే’లో నా క్యారెక్టర్.. లుక్.. డ్రెస్.. ఇలా అన్ని రకాలుగా వైవిధ్యం ఉంటుంది. నా పెర్ఫామెన్స్ ఎలా ఉందో ప్రేక్షకులే చెప్పాలి’’ అన్నాడు.
ముందు తాను ‘రాజా చెయ్యి వేస్తే’లో విలన్ పాత్ర చేయాలా వద్దా అని ఆలోచించానని.. ఐతే నిర్మాత సాయి కొర్రపాటి తనను కన్విన్స్ చేశాడని.. తన భార్య కూడా చెప్పడంతో తానీ పాత్రకు ఒప్పుకున్నానని తారకరత్న చెప్పాడు. ముందు తనను విలన్ గా అనుకున్న తర్వాతే రోహిత్ ను హీరోగా ఎంచుకున్నట్లు తారకరత్న చెప్పడం విశేషం. ‘‘ముందు నాకు కథ వినిపించి.. నేను ఓకే అన్నాక నారా రోహిత్ హీరో పాత్ర చేస్తే బాగుంటుందని సాయిగారు అన్నారు. తొలిసారి మా కుటుంబ కథానాయకుడు ఒకరితో సినిమా చేశాను. రోహిత్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. మూణ్నాలుగు రోజులు నిద్ర లేకుండా సినిమా కోసం పని చేశాడు. అతడితో పని చేయడం చాలా మంచి అనుభవం’’ అన్నాడు.