వీరసింహారెడ్డి.. సక్సెస్ తో వెలిగిపోతున్నారు

Update: 2023-01-17 03:30 GMT
సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన బాలయ్య బాబు వీర సింహారెడ్డి సినిమా బాక్సాఫీసు వద్ద భారీ ప్రభంజనం సృష్టిస్తోంది. అఖండ సినిమా తర్వాత అదే రేంజ్ లో దూసుకెళ్తున్న ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే 104 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ క్రమంలోనే వీర సింహారెడ్డి డైరెక్టర్, బాలకృష్ణ వీరాభిమాని గోపీచంద్ మలినేని.. నేడు బాలయ్య బాబును కలిశారు. సినిమా సక్సెస్ కావడంతో ఆయనను అభినందించారు.

సినిమా హిట్ కొట్టడానికి కారణం బాలకృష్ణ యాక్టింగే అంటూ గోపీచంద్ మలినేని చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా ఇండియాలోనే కాకుండా దేశ విదేశాల్లోని థియేటర్లలలో కూడా హిట్ టాక్ తో నడుస్తోంది. వీర సింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

బాలకృష్ణ సరసన శృతి హాసన్, మలయాళ భామ హానీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. బాలకృష్ణ సోదరిగా వరలక్ష్మీ షరత్ కుమార్ నెగిటివ్ షేడ్ లో నటించి మెప్పించింది. దునియా విజయ్ విలన్ గా నటించారు. తమన్ సంగీతం అందించారు. తమన్ మరోసారి తన మార్క్ బీజీఎం ఇచ్చారు.

వీరసింహా రెడ్డి సినిమాతో బాలయ్య, వాల్తేరు వీరయ్యతో చిరంజీవి ఈ సంక్రాంతికి పోటీ పడ్డారు. ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు విడుదల అయినప్పటి నుండి హౌస్ ఫుల్ తో నడుస్తున్నాయి. రెండు అగ్రహీరోల సినిమాలు హిట్ టాక్ అందుకోవడంతో పాటు వంద కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టాయి.

అటు ఓవర్సీస్ లో కూడా వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలకు మంచి వసూళ్లు వస్తున్నాయి. ప్రధానంగా యూఎస్ బాక్సాఫీస్ వద్ద వీరయ్య, వీరసింహా జోరుగా వసూళ్లు రాబడుతున్నాయి. వీరయ్య అయితే విడుదల అయిన రెండు రోజుల్లోనే మిలియన్ డాలర్ల మార్క్ ను దాటేసింది. అలాగే వీర సింహారెడ్డి కూడా మిలియన్ మార్క్ అందుకుంది. పండగ కావడం అందులోనూ వీకెండ్స్ కావడంతో సినిమా హాళ్లలో అభిమానుల కోలాహలం కనిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News