దిలీప్​కుమార్​ పరిస్థితి అత్యంత విషమం.. భావోద్వేగంతో సైరా భాను ప్రకటన..!

Update: 2020-12-07 13:25 GMT
బాలీవుడ్​ నటుడు, స్టార్​హీరో దిలీప్​ కుమార్​ ఆరోగ్యపరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నది. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.
దిలీప్​ కుమార్​ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని.. ఆయనకు ఆరోగ్యం కుదుటపడాలని అభిమానులు ప్రార్థించాలని ఆయన సతీమణి సైరా భాను కోరారు. తాజాగా ఓ టీవీ చానల్​తో ఆమె మాట్లాడారు.

సైరా భాను అలా ప్రకటించడంతో దిలీప్​ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఓ జాతీయమీడియా చానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైరా భాను మాట్లాడుతూ.. ‘ దిలీప్​ పరిస్థితి ప్రస్తుతం ఏం బాగాలేదు. ఆయన ఇంట్లోని హాల్​ నుంచి తన గదిలోకి కూడా నడవలేకపోతున్నారు. దిలీప్​ ఇమ్యూనిటీ లెవల్​ పడిపోయింది. ఆయన పక్కన ఉండటం, ఆయన స్పర్శ కలగడం నేను అదృష్టంగా భావిస్తాను. ఆయనతో కలిసి ఉండే అవకాశం నాకు కల్పించినందుకు దేవుడిని నేను కృతజ్ఞతలు తెలుపుతాను. జీవితాంతం ఆయన సేవలు చేయాలన్నదే నా ఆకాంక్ష. కానీ ఆయన ఆరోగ్యపరిస్థితి ఇప్పుడు బాగాలేదు’ అంటూ సైరా భాను చాలా ఎమోషనల్ గా మాట్లాడారు.


ఇటీవల దిలీప్​ సోదరులు ఎహసాన్ భాయ్, అస్లాం భాయ్ ఇద్దరూ కరోనా తో మరణించారు. అప్పటి నుంచి దిలీప్​ చాలా డిప్రెషన్​లో ఉన్నారు. కరోనా బాధితులకు సేవ చేయాలని, వారికి ఆర్థికసాయం చేయాలని కూడా ఆయన అభిమానులకు పిలుపునిచ్చారు. దిలీప్ కుమార్.. 1966లో సైరా భానును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే వారి వివాహ వార్షికోత్సవం కూడా ఉన్నది. కానీ సోదరుల మృతితో ఆయన ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు.


Tags:    

Similar News