ఫొటోటాక్‌ః ఛార్మితో రౌడీ స్టార్‌ బైక్‌ రైడింగ్‌

Update: 2021-02-20 04:36 GMT
రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం లైగర్‌ సినిమా కోసం ముంబయిలో చిత్రీకరణలో పాల్గొంటున్న విషయం తెల్సిందే. పూరి జగన్నాద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కు ఛార్మి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. షూటింగ్‌ జరుగుతున్నన్ని రోజులు కూడా ఛార్మి సెట్‌ లో ఉంటూ నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటుంది. లైగర్‌ ప్రొడక్షన్‌ వ్యవహారాలు కూడా దగ్గర ఉండి చూసుకుంటున్న ఛార్మి రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండతో తాజాగా షూటింగ్‌ గ్యాప్‌ లో బైక్‌ రైడింగ్‌ కు వెళ్లింది.

ముంబయి రోడ్ల మీద టూ వీలర్‌ పై విజయ్ దేవరకొండను ఎక్కించుకుని ఛార్మి సరదాగా అలా చక్కర్లు కొట్టింది. లైగర్‌ షూటింగ్‌ మొత్తం కూడా ముంబయిలోనే చేస్తున్నారు. ఇటీవలే పునః ప్రారంభం అయిన లైగర్‌ షూటింగ్‌ ను జెట్‌ స్పీడ్‌ తో పూర్తి చేసేందుకు దర్శకుడు పూరి కంటిన్యూస్‌ గా వర్క్‌ చేస్తున్నాడు. తెలుగు తో పాటు హిందీలో కూడా రూపొందుతున్న ఈ సినిమా ను ఇతర భాషల్లో కూడా డబ్బింగ్‌ చేసి విడుదల చేస్తున్నారు. అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్‌ గా నటిస్తున్న విషయం తెల్సిందే. పూరి.. ఛార్మిలతో పాటు ఈ సినిమాను బాలీవుడ్‌ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్‌ కరణ్‌ జోహార్‌ కూడా నిర్మిస్తున్నాడు.
Tags:    

Similar News