తిమ్మిని బమ్మిని చేస్తారని.. గతంలో గారడీవాళ్లకి పేరుండేది. ఇప్పుడా పేరు కొంతమంది సినిమావాళ్లకూ ఇచ్చేయాలి. ముఖ్యంగా డబ్బింగ్ సినిమాలని జనాల మీదకు వదిలేవాళ్లకి. గతవారం తెలుగులో రిలీజైన సినిమాలు మూడు. ఈ మూడు 3 రకాలు. ఒకటి డైరెక్ట్, మరొకటి రీమేక్, ఇంకొకటి డబ్బింగ్.
జయసూర్య అంటూ తమిళ సినిమాని జనాల మీదకు పంపినవాడు విశాల్. సుశీంద్రన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాని... మొదటి రోజున పర్లేదనే అన్నారు. తర్వాత నాని కామెడీగా కొట్టిన దెబ్బకి.. విశాల్ యాక్షన్ పటాపంచలైపోయింది. అసలు ఇది ఏ రకంగానూ ఏ సెంటర్లలో ఆడే సినిమా కాదనే విషయం తీసినోళ్లకి, చేసినోళ్లకి కూడా బాగానే తెలుసు. మల్టీప్లెక్స్ జనాలకు అసలు ఎక్కదు. ఇక మిగిలింది బీ, సీ సెంటర్లే. ఇక్కడైనా ఏమైనా రాలతాయా అంటే.. ఉన్న కాస్త ఆడియన్స్ ని డైనమైట్ ని అంటూ మంచు విష్ణు పట్టుకెళ్లిపోయాడు.
ఇక ఈ జయసూర్యని ఎవరు చూశారో.. ఎలా హిట్ అయిందో తెలీదు. దీనికితోడు.. రిలీజ్ రోజు కంటే.. మారుతీ,నాని వడ్డించిన భలేభలే మగాడివోయ్ కి థియేటర్ల సంఖ్య బాగా పెరిగింది. ఇది డైరెక్టుగా దెబ్బ కొట్టింది కూడా జయసూర్యనే. మరి సూపర్ హిట్ అంటూ, ధ్యాంక్స్ అంటూ ఇప్పుడు కబుర్లు మొదలుపెట్టేశాడు విశాల్. డ్యామేజ్ కంట్రోల్ కోసం అనుకోవచ్చు కానీ.. ఇప్పటికే జరగాల్సినదంతా జరిగిపోయింది. ఇదేదో నాలుగురోజుల ముందు ప్రయత్నిస్తే.. కాస్త ఫలితం ఉండేదేమో.