సినీ నటుడు, ఫిల్మ్ క్రిటిక్, 'బిగ్ బాస్' ఫేమ్ కత్తి మహేష్ రోడ్డు యాక్సిడెంట్ లో గాయపడిన సంగతి తెలిసిందే. కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు ఓ ట్రక్ ను ఢీ కొట్టడడంతో ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మహేష్ కు స్వల్ప గాయాలయ్యాయని.. నెల్లూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని వార్తలు వచ్చాయి.
తాజాగా కత్తి మహేష్ రోడ్ యాక్సిడెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. వీటిలో మహేష్ కు చెందిన ఇన్నోవా కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయిపోయి ఉంది. దీనిని బట్టి కారు బలంగా ట్రక్ ను ఢీ కొట్టినట్లు అర్థం అవుతుంది. ఇక హాస్పిటల్ లో మహేష్ బెడ్ మీద ఉన్న దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. ఈ ఫోటోలు మహేష్ కు తీవ్ర గాయాలు అయ్యాయని అనుకునేలా ఉన్నాయి. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరచుకోవడం వల్ల మహేష్ కు పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.
కత్తి మహేష్ తన స్వగ్రామం నుంచి హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం కత్తి మహేష్ కు నెల్లూరులోని మెడికేర్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు.