యువ ఎమ్మెల్యే కొత్త సినిమా రీమేక్

Update: 2021-07-09 02:30 GMT
తమిళ యంగ్ హీరో.. నవ యువ ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ ఇప్పటికే మాగిజ్‌ తిరుమేని దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా గత ఏడాది మొదలైంది. కరోనా మరియు ఇతర కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ ఏడాది చివరి వరకు ఆ సినిమాను ముగించబోతున్నట్లుగా చెబుతున్నారు. ఇదే సమయంలో ఉదయనిధి స్టాలిన్ కొత్త సినిమాను ప్రకటించాడు. బాలీవుడ్‌ లో సూపర్‌ హిట్‌ అయిన ఆర్టికల్‌ 15 ను సౌత్‌ లో రీమేక్ చేయాలనే ప్రయత్నాలు చాలా రోజులుగా జరుగుతున్నాయి. ఎట్టకేలకు ఈ సినిమా తమిళంలో పట్టాలెక్కబోతుంది.

ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యి మంచి జోష్‌ లో ఉన్న ఉదయనిధి స్టాలిన్‌ వరుస సినిమాలు చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఒక వైపు నిర్మాతగా మరో వైపు హీరోగా వరుసగా సినిమాలు చేసేందుకు సిద్దం అవుతున్న ఈయన ముందు ముందు మరిన్ని పెద్ద సినిమాలకు కమిట్‌ అవ్వాలని కూడా భావిస్తున్నాడట. ఆర్టికల్ 15 సినిమాలో శివానీ రాజశేఖర్‌ హీరోయిన్‌ గా నటించబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది.

తెలుగు లో ఒక యంగ్‌ హీరో ఈ సినిమా రీమేక్ లో నటించేందుకు ఓకే చెప్పాడని త్వరలోనే ఆ సినిమా ను కూడా పట్టాలెక్కించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కాని ఇప్పటి వరకు ఆ విషయమై క్లారిటీ ఇవ్వలేదు. ఈ లోపు తమిళంలో ఉదయనిధి స్టాలిన్ ఆర్టికల్‌ 15 ను రీమేక్ చేసేందుకు సిద్దం అయ్యాడు. తమిళంలో సక్సెస్‌ అయితే అప్పుడు తెలుగు లో రీమేక్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
Tags:    

Similar News