దేవర.. పోస్టర్స్ తోనే కిక్కిస్తున్నారుగా

‘దేవర’ సినిమాపై పబ్లిక్ లో హైప్ తీసుకురావడానికి మేకర్స్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

Update: 2024-09-17 10:30 GMT

 ‘దేవర’ సినిమాపై పబ్లిక్ లో హైప్ తీసుకురావడానికి మేకర్స్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ తో మూవీపై కొంత బుజ్ క్రియేట్ చేశారు. వీటిపై కామెంట్స్ ఎలా వచ్చిన కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రం సాంగ్స్, ట్రైలర్ బాగా కనెక్ట్ అయ్యాయి. ట్రైలర్ తో ఎన్టీఆర్ ఎలివేషన్ షాట్స్ కి అయితే ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. కచ్చితంగా ‘దేవర’ మూవీ ఎన్టీఆర్ కెరియర్ లోనే బెస్ట్ సినిమా అవుతుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. కొరటాల శివ కూడా మూవీని హైవోల్టేజ్ యాక్షన్ కథాంశంతో అద్భుతంగా ఆవిష్కరించాడని భావిస్తున్నారు.

‘దేవర’ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తండ్రి, కొడుకులుగా రెండు పాత్రలు చేస్తున్నారు. ఈ రెండు పాత్రలు కూడా పూర్తి భిన్నంగా ఉంటాయనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా దేవర మూవీ నుంచి ఎన్టీఆర్ క్యారెక్టర్ పోస్టర్స్ ని రిలీజ్ చేస్తున్నారు. సోమవారం తండ్రి క్యారెక్టర్ లో ఉన్న ఎన్టీఆర్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో తారక్ పెద్ద కత్తి పట్టుకొని ఉన్నారు. ఈ లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.

తాజాగా కొడుకు క్యారెక్టర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ లుక్ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేశారు. సైన్ ఆఫ్ డిస్ట్రక్షన్ అంటూ క్యాప్షన్ మెన్షన్ చేసి పోస్టర్ ని వదిలారు. ఇందులో వెనక్కి తిరిగి ఉన్న తారక్ చేతిలో కట్టిపట్టుకొని సీరియల్ గా చూస్తున్నాడు. ఈ పోస్టర్ లో కండలు తిరిగిన శరీరంతో ఎన్టీఆర్ చాలా వైబ్రెంట్ గా ఉన్నాడనే మాట వినిపిస్తోంది. ‘దేవర’ మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి రాబోతోంది. ఆ లోపు సినిమాకి వీలైనంత హైప్ తీసుకొచ్చే పనిలో చిత్ర యూనిట్ ఉంది.

అందుకే పోస్టర్ స్టిల్స్ ని డైలీ వదులుతున్నారు. అలాగే ప్రీరిలీజ్ ఈవెంట్ రోజు మూవీ సెకండ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారనే మాట వినిపిస్తోంది. ఈ ట్రైలర్ ని కంప్లీట్ యాక్షన్ ఎలివేషన్స్ షాట్స్ తో కట్ చేశారనే మాట వినిపిస్తోంది. మొత్తమీద ‘దేవర’ టీమ్ వరుసగా పోస్టర్స్ తోనే సినిమాపై హైప్ పెంచుతూ కావాల్సినంత కిక్ ఇస్తున్నారనే టాక్ నడుస్తోంది.

ఇదిలా ఉంటే సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పోస్టర్స్ మాత్రమే రిలీజ్ చేస్తారా మిగిలిన క్యాస్టింగ్ కి సంబందించిన లుక్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి వదులుతారా అనేది తెలియాల్సి ఉంది. ఒక వేళ అన్ని పాత్రలకి సంబందించిన పోస్టర్స్ రిలీజ్ చేస్తే రిలీజ్ వరకు సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News