69 వయసులో AI కోర్సులో చేరిన కమల్‌హాసన్!
ఇలాంటి విషయాల్లో ఉలగనాయగన్ కమల్ హాసన్ ఎప్పుడూ ముందుంటారు.
వాట్సాప్ వచ్చిన కొత్తలో దాని గురించి తెలుసుకోని వ్యక్తిని మూర్ఖుడిలా చూసారు. ఇప్పుడు ఏఐతోను అదే పరిస్థితి. ఏఐ సాంకేతికత గురించి తెలుసుకోని మానవుడు రేసులో పూర్తిగా వెనకబడినట్టే. ముఖ్యంగా సాంకేతిక యుగంలో మనిషి మనుగడ పూర్తిగా టెక్నాలజీ చుట్టూనే తిరుగుతోంది. అయితే సాంకేతికతను నేర్చుకోవడానికి ఉత్సాహం ప్రయోగాత్మక ఆలోచన అవసరం. ఇలాంటి విషయాల్లో ఉలగనాయగన్ కమల్ హాసన్ ఎప్పుడూ ముందుంటారు. విశ్వనటుడు కమల్ ప్రస్తుతం అమెరికాలో పాపులర్ యూనివర్శిటీలో ఉన్నారు. అక్కడ ఏఐ క్లాసులు తీసుకుంటున్నారని సమాచారం.
వయసు 70 కి చేరువైనా, ఐదు దశాబ్ధాలుగా సినీనటుడిగా శ్రమ అన్నదే ఎరుగని ది గ్రేట్ కమల్ హాసన్.. ఇంకా తన ప్రయోగాలను విడిచిపెట్టడం లేదు. 69 సంవత్సరాల వయస్సులోను అతడు వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. సినీపరిశ్రమలో చాలా సాంకేతిక విధానాలను, తెరవెనక టెక్నిక్స్ ని పరిశ్రమలకు అందించిన గొప్ప మేధావిగా కమల్ హాసన్ తన పంథాను మార్చుకోవడం లేదు.
అతడు ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై క్రాష్ కోర్సును అభ్యసించడానికి అమెరికా వెళ్లాడు. అమెరికాలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయంలో క్రాష్ కోర్సు చేస్తున్నారు ఈ ఏజ్ లెస్ హీరో. తరగతులు ఈ వారాంతంలో ప్రారంభమవుతాయి. ఈ కోర్సు 90 రోజుల పాటు సాగుతుంది. అయితే కమల్ హాసన్ చాలా సినిమా కమిట్‌మెంట్‌లు లైన్‌లో ఉన్నందున 45 రోజుల్లో పూర్తి చేయాలనేది ప్లాన్. కమల్ హాసన్ తన భవిష్యత్ ప్రాజెక్ట్‌లలో ఏఐతో ప్రయోగాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నారని కూడా దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
విక్రమ్, కల్కి 2898 ADలో అద్భుత నటనతో ఆకట్టుకున్న కమల్ వరుసగా భారీ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. మణిరత్నం - థగ్ లైఫ్‌తో ఇటీవల బిజీగా ఉన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. అలాగే శంకర్‌తో `ఇండియన్ 3` షూటింగ్ పూర్తి చేసాడు. సినిమా వచ్చే ఏడాది విడుదల అవుతుంది. ప్రభాస్ తో కల్కి 2898 AD సీక్వెల్ చేయాల్సి ఉంది. సల్మాన్ ఖాన్ తదుపరి చిత్రంలో కమల్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తాడని పుకార్లు ఉన్నాయి. అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.