ఆ నలుగురికి భిన్నంగా టక్కరి దొంగ!
డార్లింగ్ ప్రభాస్ లైనప్ ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. ప్రాజెక్ట్ లు లాక్ చేయడం..వాటిని పూర్తి చేసి రిలీజ్ చేయడంలో? ప్రభాస్ ప్లానింగ్ ఎంతో పక్కాగా ఉంటుంది;
డార్లింగ్ ప్రభాస్ లైనప్ ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. ప్రాజెక్ట్ లు లాక్ చేయడం..వాటిని పూర్తి చేసి రిలీజ్ చేయడంలో? ప్రభాస్ ప్లానింగ్ ఎంతో పక్కాగా ఉంటుంది. ఏకా కాలంలోనే రెండు ..మూడు సినిమా షూటింగ్ లు చేస్తున్నాడంటే? డార్లింగ్ ఎంత స్పీడ్ గా ఉన్నాడు? అన్నది అద్దం పడుతుంది. ఈ విషయంలో చాలా మంది హీరోలకు ప్రభాస్ స్పూర్తిగా నిలిచాడు.
ప్రభాస్ ను చూసే ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా సినిమాలు చేసే విధానంలో మార్పులు తీసుకొచ్చారు.
`ఆర్ ఆర్ ఆర్` సెట్స్ లో ఉండగానే రామ్ చరణ్ శంకర్ ని లైన్ లోకి తెచ్చి `గేమ్ ఛేంజర్` చేసాడు. ఆ సినిమా లైన్ లో ఉండగానే బుచ్చిబాబు, సుకుమార్ లను తెరపైకి తెచ్చి ఆర్సీ 16, 17 లాక్ చేసాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ `దేవర` సెట్స్ లో ఉండగానే? బాలీవుడ్ డెబ్యూకి రెడీ అయి వార్ 2 , ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లాక్ చేసాడు.
అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 సెట్స్ లో ఉండగానే త్రివిక్రమ్, అట్లీని లైన్ లోకి తెచ్చాడు.
ఫైనల్ గా ముందుగా అట్లీ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తున్నాడు. ఇలా వీళ్లంతా ఆన్ సెట్స్ లో ఉన్న సినిమా రిలీజ్ కి ముందే? తదుపరి ప్రాజెక్ట్ పై ఓ క్లారిటీ ఇస్తున్నారు. కానీ సూపర్ స్టార్ మహేష్ మాత్రం ఇంత వరకూ ఆ ఛాన్స్ తీసుకోవడం లేదు. ఆ నలుగురికి భిన్నంగానే మహేష్ ప్రయాణం కనిపిస్తుంది.
ప్రస్తుతం రాజమౌళితో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. `గుంటూరు కారం` సెట్స్ లో ఉండగా ఈ ప్రాజెక్ట్ గురించి పెద్దగా ప్రచారంలోకి కూడా రాలేదు. మీడియా కథనాల వరకే పరిమితం తప్ప! అధికారి కంగా వెల్లడించే వరకూ విషయం బయటకు పొక్కలేదు. ప్రస్తుతం రాజమౌళి సినిమా సెట్స్ లో ఉంది. ఈ సినిమా తర్వాత మహేష్ ఏ డైరెక్టర్ లో పనిచేస్తాడు? అన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. సందీప్ రెడ్డి వంగా పేరు మహేష్ లిస్ట్ లో ఉన్నా? అది ఇంకా కన్పమ్ కాలేదు. ఇలా ఆ నలుగురికి భిన్నంగా టక్కరి దొంగ జర్నీ సాగుతోంది. మరి రాజమౌళి సినిమా తర్వాతైనా ప్లానింగ్ చేంజ్ చేస్తాడేమో చూడాలి.