టాలీవుడ్ టాప్ స్టార్లు కోరుకునేది ఆ ఐదుగురినే?

ప్ర‌భాస్, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, బ‌న్నీ ఇప్ప‌టికే పాన్ ఇండియా స్లార్లు. ఎస్ ఎస్ ఎంబీ 29 తో మ‌హేష్ కూడా పాన్ ఇండియా వ‌రల్డ్ లోకి అడుగు పెడుతున్నారు.;

Update: 2025-03-22 01:45 GMT

ప్ర‌భాస్, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, బ‌న్నీ ఇప్ప‌టికే పాన్ ఇండియా స్లార్లు. ఎస్ ఎస్ ఎంబీ 29 తో మ‌హేష్ కూడా పాన్ ఇండియా వ‌రల్డ్ లోకి అడుగు పెడుతున్నారు. ఆ ఐదుగురు హీరోలు ఏ సినిమా చేసినా? అది పాన్ ఇండియాలోనే రిలీజ్ అవుతుంది. మ‌రి ఈ న‌యా హీరోల పాన్ ఇండియా న‌మ్మ‌కం ఎవ‌రు? అంటే రాజ‌మౌళి, సుకుమార్, ప్ర‌శాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్ మాత్ర‌మే అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ఇప్ప‌టికే రాజ‌మౌళితో ప్ర‌భాస్, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ సినిమాలు చేసారు. ఈ ముగ్గురు కామ‌న్ గా ప‌ని చేయాల్సిన డైరెక్ట‌ర్ ఒక‌రున్నారు? అత‌డే సుకుమార్. రామ్ చ‌ర‌ణ్ సుకుమార్ తో ఇప్ప‌టికే `రంగ‌స్థ‌లం` చేసినా అది పాన్ ఇండియా సినిమా కాదు. ఆర్సీ 17 తో పాన్ ఇండియా చిత్రం ఇప్ప‌టికే ఫిక్సైంది. అలాగే ప్ర‌భాస్ కూడా సుకుమార్ తో ఓ సినిమా చేయాలి. ఎన్టీఆర్ కూడా సుక్కుతో పాన్ ఇండియా చిత్రం చేయాలి.

ఇక సందీప్ రెండ్డి వంగా ఇప్ప‌టికే ప్ర‌భాస్ తో స్పిరిట్ లాక్ అయింది. మిగ‌తా న‌లుగురు హీరోలు కూడా సందీప్ తో పని చేయ‌డానికి సిద్దంగా ఉన్నారు. ప్ర‌శాంత్ నీల్ తో ప్ర‌భాస్ `స‌లార్` చేసాడు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ తో ప్ర‌శాంత్ నీల్ ఓ సినిమా చేస్తున్నాడు. రామ్ చ‌ర‌ణ్‌, బ‌న్నీ అత‌డితో ప‌నిచేసే అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే నాగ్ అశ్విన్ తో ప్ర‌భాస్ మిన‌హా హీరోలంతా పని చేయ‌డానికి ఆస‌క్తిగా ఉన్నారు.

ఇవ‌న్నీ కూడా సూప‌ర్ కాంబినేష‌న్స్. వాళ్లు చేతిలు క‌లిపితే వంద‌ల‌...వేల కోట్ల మార్కెట్ వ‌ర్కౌట్ అవుతుంది. వ‌చ్చే ప‌దేళ్ల‌లో ఈ కాంబినేష‌న్లు సెట్ అవ్వ‌డానికి అవ‌కాశం ఉంది. ఆ ఐదురుగు డైరెక్ట‌ర్లతో ఈ న‌యా స్టార్లు కూడా చేతులు క‌ల‌ప‌డానికి సంసిద్దంగా ఉన్నారు. మ‌రో ప‌దేళ్ల త‌ర్వాత తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడంలో ఈ కాంబినేష‌న్లు కీల‌క పాత్ర పోషిస్తాయి అన్న‌ది వాస్త‌వం.

Tags:    

Similar News