ఫోటో స్టోరి: రత్తాలు ముత్యాలు పూల్‌సైడ్ రచ్చ
కొన్నేళ్లుగా ఆ ఇద్దరూ ముంబై ఈవెంట్లలో సందడి చేస్తూ మీడియా కంటికి చిక్కుతున్నారు. ముఖ్యంగా ఆ ఇద్దరి స్నేహం గురించి ముంబై పరిశ్రమలో బోలెడంత చర్చ సాగుతోంది.
ఇంతకీ ఎవరీ రత్తాలు - ముత్యాలు..? స్విమ్ సూట్లతో రచ్చ రంబోళా చేస్తున్నారు. వీళ్లెవరో కనిపెట్టారా? రత్తాలు సింగారానికి, ముత్యాలు హొయలుకి ఫిదా అయిపోవాల్సిందే. ఎందులోనూ తగ్గేదేలే అంటున్న ఈ భామలు రకుల్ ప్రీత్- ప్రగ్య జైశ్వాల్. వీలు కుదిరినప్పుడల్లా ముంబై రెస్టారెంట్లు, పబ్లిక్ వేదికలపై ఈ జోడీ బోలెడంత రచ్చ చేస్తున్నారు. ఆ ఇద్దరూ ముంబైలో ఉన్నప్పుడు సాయంత్రాల మీటింగులు, సినిమాల గురించిన కబుర్లు చెప్పుకుంటారు. రెస్టారెంట్లు, బాలీవుడ్ ఈవెంట్లకు వెళుతుంటారు.
కొన్నేళ్లుగా ఆ ఇద్దరూ ముంబై ఈవెంట్లలో సందడి చేస్తూ మీడియా కంటికి చిక్కుతున్నారు. ముఖ్యంగా ఆ ఇద్దరి స్నేహం గురించి ముంబై పరిశ్రమలో బోలెడంత చర్చ సాగుతోంది. ఏది ఏమైనా కానీ రత్తాలు ముత్యాలు తరహాలో ఈ జంట స్నేహం అందరిలో స్ఫూర్తి నింపుతోంది. అటు హిందీ పరిశ్రమ, ఇటు తెలుగు పరిశ్రమలో అవకాశాలు ఎలా అందిపుచ్చుకోవాలో తెలియక ఈ భామలిద్దరూ ఇటీవల సతమతమవుతున్నారు. రకుల్ ఇప్పటివరకూ తన హిందీ నిర్మాత కం బోయ్ ఫ్రెండ్ సాయంతో తన మనుగడను సాగిస్తోంది. త్వరలోనే అతడిని పెళ్లాడుతుందని భావిస్తున్నా ఇప్పట్లో ఆ ప్రకటన ఉండేట్టు లేదు. ప్రగ్య ప్రస్తుతం ఎఫైర్లతో సంబంధం లేకుండా కెరీర్ బండిని సాగిస్తోంది.
ఒక చిన్న పూల్ పార్టీ ఎవరి హృదయాలను గాయపరచకుండా.. అంటూ ఈ అందమైన ఫోటోషూట్ ని షేర్ చేయగా అది వైరల్ గా మారుతోంది. రకుల్- ప్రగ్యతో పాటు, పూల్ సైడ్ పార్టీలో నేహా శెట్టి, మంచు లక్ష్మీ, నంబియార్, సౌమ్య తదితరులు ఉన్నారు. ఇందులో రకుల్- ప్రగ్య సపరేట్గా ఉన్న స్పెషల్ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది. హృదయాలను గాయపరచకుండా లేదా దొంగిలించకుండా ఏదీ ఉండదని ఈ ఫోటో చూసాక మనం అర్థం చేసుకోవాలి. ఈ ఇద్దరికీ పాపులర్ జువెలరీ బ్రాండ్.. పాపులర్ డిజైనర్ దుస్తుల బ్రాండ్, ఫుట్ వేర్ బ్రాండ్ ప్రమోషన్ ని అందిస్తున్నాయి.