త్రిపాత్రాభిన‌యం అత‌నొక్కడికే సాధ్య‌మైంది!

హీరోగా , ద‌ర్శ‌కుడిగా, కీల‌క పాత్ర ధారిగా ఒకేసారి రాణించ‌డం అన్న‌ది అంత సుల‌భం కాదు. ఎంతో ప్లానింగ్..ప‌క్కా ప్ర‌ణాళిక ఉంటే సాద్యం కానిది.;

Update: 2025-03-22 02:30 GMT

హీరోగా , ద‌ర్శ‌కుడిగా, కీల‌క పాత్ర ధారిగా ఒకేసారి రాణించ‌డం అన్న‌ది అంత సుల‌భం కాదు. ఎంతో ప్లానింగ్..ప‌క్కా ప్ర‌ణాళిక ఉంటే సాద్యం కానిది. ఈ విష‌యంలో మాలీవుడ్ న‌టుల్ని కొట్ట‌డం అన్న‌ది అసాధ్య‌మే. మోహ‌న్ లాల్, మ‌మ్ముట్టి లాంటి స్టార్ హీరోలు ఏడాది ఆరేడు సినిమాలు రిలీజ్ చేస్తున్నారంటే? కార‌ణం మూడు షిప్టులు ప‌ని చేయ‌డంతోనే సాధ్య‌మ‌వుతుంది.

అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రం ఆ ఇద్ద‌ర్నీ మించి శ్రమిస్తున్నాడు? అన్న‌ది అంతే వాస్త‌వం. ఓవైపు ఆయ‌న హీరోగా మాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే మ‌రోవైపు టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నాడు. న‌టుడిగా ఏ భాష‌లో మంచి అవ‌కాశం వ‌చ్చినా నో చెప్ప‌కుండా న‌టిస్తున్నాడు. అలాగేని హీరోగానూ సినిమాలు త‌గ్గ‌డం లేదు. హీరోగా అక్క‌డ అభిమానుల్ని ఎంట‌ర్ టైన్ చేస్తూనే ఏకా కాలంలో ఇత‌ర భాష‌ల్లోనూ ప‌నిచేస్తున్నాడు.

ఈ రెండింటిని మించి మ‌రో కెప్టెన్ ఆఫ్ ది షిప్ బాధ్య‌త‌లు కూడా అంతే విజ‌య‌వంత‌గా నెర‌వర్తిస్తున్నాడు. సొంతంగా క‌థ రాసుకుని దాన్ని వెండి తెర‌కు ఎక్కించే బాధ్య‌త‌లు తానే తీసుకుంటున్నాడు. అక్క‌డా మంచి స‌క్సెస్ అయ్యాడు. అత‌డు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమాలు ఇత‌ర భాష‌ల్లో కూడా రీమేక్ అవుతున్నాయంటే? డైరెక్ట‌ర్ గా అత‌డి స‌క్సెస్ పీక్స్ అనే చెప్పాలి.

ఇలా ఏక కాలంలో మూడు రంగాల్లో రాణించ‌డం భార‌త‌దేశ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో పృధ్వీకే సాధ్య‌మైంది. ఇదే త‌ర‌హాలో రాణించాల‌ని మోహ‌న్ లాల్ ఆ మ‌ధ్య ఓ ప్ర‌య‌త్నం చేసాడు. తానే స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కించారు. కానీ ఆ సినిమా అంచ‌నాలు అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. కోలీవుడ్ నుంచి విశాల్ కూడా అలాంటి అటెంప్ట్ చేస్తున్నాడు. మ‌రి విశాల్ ఎలాంటి రిజ‌ల్ట్ అందుకుంటాడో చూడాలి.

Similar News