'పుష్ప' సినిమాని ఇంత మంది రిజెక్ట్ చేశారా?
సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫాహాద్ ఫాజిల్ పాత్రల కోసం మొదట వేరే వాళ్లను సంప్రదించారట సుకుమార్.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, సునీల్ విలన్ రోల్స్ చేశారు. 2021లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియన్ స్టార్ గా మారాడు.
సినిమాలో పుష్పరాజ్ పాత్రలో విశ్వరూపం చూపించాడు. దాంతో బన్నీ నటనకు ఏకంగా జాతీయ అవార్డు సైతం వరించింది ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వల్ గా పుష్ప : ది రూల్ తెరకెక్కుతున్న విషయం తెలుసిందే. ఈ సీక్వెల్ కోసం వరల్డ్ వైడ్ సినీ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాగా 'పుష్ప' లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీని కొందరు స్టార్స్ రిజెక్ట్ చేశారనే విషయం చాలా మందికి తెలియదు.
సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫాహాద్ ఫాజిల్ పాత్రల కోసం మొదట వేరే వాళ్లను సంప్రదించారట సుకుమార్. వాళ్ల డీటెయిల్స్ లోకి వెళ్తే.. పుష్ప సినిమా కోసం సుకుమార్ మొదట సూపర్ స్టార్ మహేష్ బాబుని అప్రోచ్ అయ్యారట. కథ విన్న మహేష్ హీరో పాత్రకి కొంత నెగిటివ్ షేడ్స్ ఉండడంవల్ల అలాంటి రోల్స్ తనకు సెట్ కావని రిజెక్ట్ చేశాడట. మహేష్ తర్వాత సమంత కూడా పుష్ప సినిమాని రిజెక్ట్ చేసింది.
పుష్ప లో స్పెషల్ సాంగ్ తో మెప్పించిన సమంతకు మొదట ఫిమేల్ లీడ్ గా ఆఫర్ వచ్చింది. కానీ సామ్ కూడా రిజెక్ట్ చేయడంతో ఆ చాన్స్ రష్మికకు వెళ్ళింది. 'రంగస్థలం' తర్వాత రూరల్ ఉమెన్ సెంట్రిక్ రోల్స్ లో నటించడానికి సమంత ఇష్టపడలేదని, అందుకే పుష్పలో హీరోయిన్ ఆఫర్ ని తిరస్కరించిందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానిని 'పుష్ప' లో ఐటమ్ సాంగ్ కోసం సుకుమార్ సంప్రదించారు.
కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఆమె తప్పుకోవడంతో సమంత స్పెషల్ సాంగ్ లో మెరిసింది. తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతికి సైతం పుష్ప లో ఛాన్స్ వచ్చింది. సినిమాలో ఫాహద్ ఫాజిల్ పోషించిన భన్వర్ సింగ్ షికావత్ రోల్ కోసం సుకుమార్ ఫస్ట్ విజయ్ సేతుపతిని అప్రోచ్ అయ్యాడు. కానీ విజయ్ సేతుపతి మళ్లీ విలన్ రోల్స్ చేయడానికి ఇష్టపడక రిజెక్ట్ చేసాడు. దాంతో అతని స్థానంలో ఫాహాద్ ఫాజిల్ ని తీసుకున్నారు.