రామ్ 'సాగర్' కథ ఎంతవరకు వచ్చింది?
ఇక నాన్ స్టాప్ గా సినిమాకి సంబంధించిన షూటింగ్ పనులు కొనసాగుతున్నాయి.;
మొన్నటివరకు మాస్ సినిమాలతో కొనసాగిన హై ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నెక్స్ట్ రొమాంటిక్ లవ్ డ్రామా సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. లవర్ బాయ్ గా వచ్చిన ప్రతీసారి కూడా రామ్ మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఈసారి P మహేష్ బాబు దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా అలాంటిదే. ఇప్పటికే విడుదలైన లుక్ కూడా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది. ఇందులో రామ్ సాగర్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక నాన్ స్టాప్ గా సినిమాకి సంబంధించిన షూటింగ్ పనులు కొనసాగుతున్నాయి.
ఈ సినిమా మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసి, రెండో షెడ్యూల్ కోసం రాజమండ్రికి వెళ్లిన యూనిట్ అక్కడ భారీగా షూటింగ్ నిర్వహించింది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మాస్ హీరో రామ్ పోతినేని మళ్లీ తన ఎనర్జీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. రాజమండ్రిలో మొత్తం 34 రోజులు పాటు షెడ్యూల్ జరిగింది. అక్కడ ప్రకృతి అందాల మధ్య కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.
నాన్ స్టాప్‌గా జరిగిన ఈ షెడ్యూల్‌లో రెండు పాటలు, భారీ యాక్షన్ సీక్వెన్స్, ప్రధాన డైలాగ్ సీన్స్ చిత్రీకరించారు. యూనిట్ డెడికేషన్‌తో రాత్రి పగలు షూటింగ్ నిర్వహించడం విశేషం. ఈ. లవ్ సినిమాలో కాస్త యాక్షన్ టచ్ కూడా ఉండబోతున్నట్లు అర్ధమవుతుంది. హీరోయిన్‌గా భగ్యశ్రీ బోర్సే ఈ చిత్రంలో నటిస్తుండగా, ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందని సమాచారం.
ఈ షెడ్యూల్‌లో రావు రమేష్, మురళీ శర్మ లాంటి సీనియర్ నటులతో పాటు సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ లాంటి పాపులర్ యాక్టర్స్ పాల్గొన్నారు. వీరి పాత్రలు కూడా ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ప్రొడక్షన్‌లో ఈ చిత్రం తెరకెక్కుతుండటంతో, సినిమాపై మరింత హైప్ పెరిగింది. మార్చి 28 నుంచి మరో కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈసారి లొకేషన్ హైదరాబాద్.
ఇక్కడ మరింత రిచ్ విజువల్స్‌తో సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ సీన్స్ కోసం ఈ షెడ్యూల్‌లో ప్లాన్ చేశారు. దర్శకుడు మహేష్ బాబు పీ ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు కొత్త తరహా అనుభూతిని అందించేలా మలచుతున్నారని టాక్. ఇక సినిమాకు వివేక్-మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు.