సలార్ లెక్కలు.. తమిళ్ మార్కెట్ మనకంటే పెద్దదే..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని మంచి కలెక్షన్స్ తో ప్రపంచ వ్యాప్తంగా దూసుకుపోతోంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని మంచి కలెక్షన్స్ తో ప్రపంచ వ్యాప్తంగా దూసుకుపోతోంది. ఇప్పటికే 500 కోట్లకి పైగా కలెక్షన్స్ ని దాటేసి జైలర్ రికార్డ్ ని బ్రేక్ చేసే దిశగా సలార్ మూవీ దూసుకుపోతోంది. నార్త్ ఇండియాలో కూడా కలెక్షన్స్ పుంజుకుంటున్నాయి. ఈ వీకెండ్ మొత్తం సలార్ కి కలిసొచ్చే అవకాశం ఉంది. డార్లింగ్ ప్రభాస్ ఖాతాలో సలార్ తో బ్లాక్ బస్టర్ హిట్ పడినట్లే అని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా తెలుగులో ఇప్పటి వరకు 290 కోట్ల గ్రాస్ ని మాత్రమే కలెక్ట్ చేసింది. సౌత్ ఇండియాలో తమిళంతో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాలలో మూవీ మార్కెట్ పెద్దదని అందరూ భావిస్తూ ఉంటారు. తెలుగు ఆడియన్స్ అన్ని సినిమాలు చూడటానికి ఇష్టపడతారు. బాషాబేధం ఉండదు. అందుకే ఇతర భాషా చిత్రాలు కూడా తెలుగులో మంచి వసూళ్లు సాధిస్తాయి. తెలుగు సినిమాలకి పాజిటివ్ టాక్ వస్తే సాలిడ్ కలెక్షన్స్ వస్తాయి.
అయితే ఈ ఏడాది కోలీవుడ్ నుంచి జైలర్, లియో సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవి పంక్తు కమర్షియల్ హీరోయిక్ మూవీస్. చెప్పుకోదగ్గ కథ, కథనాలు లేవు. అయిన కూడా కేవలం తమిళంలోనే ఆ సినిమాలు 500 కోట్ల మార్క్ ని అందుకున్నాయి. సలార్ తో పోల్చుకుంటే రెండు సినిమాలు బడ్జెట్ పరంగా గాని విజువల్ ప్రెజెంటేషన్ పరంగా కాని తక్కువలోనే ఉంటాయి.
అయితే సలార్ మూవీ ఇప్పటికి తెలుగు రాష్ట్రాలలో 500 కోట్ల మార్క్ ని టచ్ చేయలేకపోయింది. కేవలం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాలు మాత్రమే తెలుగులో 500 కోట్లు కలెక్ట్ చేశాయి. ఇప్పుడు సలార్ కూడా లాంగ్ రన్ లో 450 నుంచి 500 కోట్ల మధ్యనే తెలుగు రాష్ట్రాలలో కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
ఈ లెక్కల బట్టి సలార్ సినిమా ద్వారా మన తెలుగు రాష్ట్రాల మార్కెట్ తమిళం కంటే తక్కువ అనే క్లారిటీ వస్తోంది. తమిళంలో ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న లియో మూవీ భారీ కలెక్షన్స్ ని కొల్లగోడితే తెలుగులో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సలార్ మూవీ లోకల్ గా భారీ కలెక్షన్స్ ని రాబట్టడంలో తడబడుతుంది.