ఐదు భాషల్లో శ్రుతి హాసన్ సమరం!
విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దుల కుమార్తెగా పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ జర్నీ ప్రతిభ గురించి చెప్పాల్సిన పనిలేదు
విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దుల కుమార్తెగా పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ జర్నీ ప్రతిభ గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడు మల్టీట్యాలెంటెడ్. నటిగా..గాయానిగదా..కంపోజర్ గా..మ్యూజిక్ బ్యాండ్ నిర్వాహకురాలిగా ఎంట్రీకి ముందే ప్రతిభని చాటుకుంది. నటిగా ఆరంభంలో వైఫల్యం ఎదురైనా ఎమాత్రం నెరవకుండా జర్నీ ప్లాన్ చేసుకుని ముందుకు సాగి సక్సెస్ అయింది. ప్రేమ విషయంలోనూ అలాంటి తప్పిదాలే జరిగాయి.
ఒకసారి మనసుకు తగిలిన గాయం గుర్తుంచుకుని మళ్లీ అలాంటి గాయాలు తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. అలాగని ప్రేమకి వ్యతిరేకం కాదు..ప్రేమించడం లేదని కాదు. అనుభవాల నుంచి అమ్మడు నేర్చుకున్న పాఠాలవన్నీ. ఇక నటిగా ఆమె జర్నీ దేదీప్యమానంగా సాగిపోతుంది. అన్ని భాషల్లోనూ అవకాశాలు అందుకుంటుంది. ఈ నేపథ్యంలోనే పాన్ ఇండియా సినిమా 'సలార్' లో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రుతిహాసన్ ఆ సినిమా డబ్బింగ్ పనులు పూర్తిచేసే పనిలో ఉంది.
ఇప్పటికే మూడు భాషల్లో డబ్బింగ్ పూర్తిచేసిందిట. మిగతా రెండు భాషలకు సంబంధించి కూడా డబ్బింగ్ పూర్తి చేసి ఎగ్జిట్ అవుతానంటుంది. ఈ సినిమా తెలుగు..తమిళం..మలయాళం..కన్నడం..హిందీ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఆ భాషలన్నింటిలోనూ శ్రుతి హాసన్ స్వయంగా డబ్బింగ్ చెబుతుంది. ఇలా ఇన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పడం ఇదే తొలిసారి. ఇప్పటివరకూ అమ్మడు నటించిన ఏ సినిమా ఇన్ని భాషల్లో రిలీజ్ అవ్వలేదు.
తెలుగు..తమిళం..హిందీ వరకే పరిమితమయ్యాయి. కానీ 'సలార్' పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో తప్పలేదు. మేకర్స్ ఎక్కడా రాజీ పడటం లేదు. ఏ భాషకి ఆ భాషలో సినిమాలో నటించిన నటీనటులతోనే చెప్పిస్తున్నారు. ఇలా అయితేనే సినిమాలో ఫీల్ మిస్ అవ్వదని..వాస్తవ సినిమాని చూసిన అనుభూతి కలుగుతుంది. అందుకే వీలైనంత వరకూ పాత్రధారులతోనే డబ్బింగ్ చెప్పిస్తున్నారు. ఇక శ్రుతి హాసన్ డబ్బింగ్ పూర్తి చేసిన అనంతరం మళ్లీ ప్రచారం సమయంలోనే కనిపిస్తుంది.