అది చూసి ఎట్రాక్ట్ అయ్యాన‌ని...చైత‌న్య‌తో ప‌రిచ‌యం.. అలా జ‌రిగింది!

డిసెంబ‌ర్ లో పెళ్లి చేసుకుని ఒక‌టైన అక్కినేని నాగ చైత‌న్య‌, శోభిత ధూళిపాళ రీసెంట్ గా వోగ్ కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన విష‌యం తెలిసిందే.;

Update: 2025-03-20 05:05 GMT

డిసెంబ‌ర్ లో పెళ్లి చేసుకుని ఒక‌టైన అక్కినేని నాగ చైత‌న్య‌, శోభిత ధూళిపాళ రీసెంట్ గా వోగ్ కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ ఇంట‌ర్వ్యూలో శోభిత ఎన్నో విష‌యాల‌ను రివీల్ చేసింది. చైత‌న్యను క‌ల‌వ‌క‌ముందు తాను ముంబైలోనే సెటిల్ అవాల‌నుకున్న‌ట్టు, ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి సంబంధించిన వ్య‌క్తితో రిలేష‌న్ లోకి వెళ్ల‌కూడ‌దనుకున్న‌ట్టు తెలిపింది.

కానీ చైత‌న్య‌ను క‌లిశాక త‌న ఆలోచ‌నా దృక్ప‌థం మొత్తం మారిపోయిందని శోభిత చెప్పింది. చైతూ ఎంతో బ్యాలెన్డ్స్ గా,చాలా క్లియ‌ర్ మైండ్ తో ఉంటాడ‌ని చెప్పిన శోభిత, చైతూని క‌లిసేవ‌ర‌కు అత‌ను అంత డౌన్ టూ ఎర్త్ ప‌ర్స‌న్ అని త‌న‌కు తెలియ‌ద‌ని, అత‌ని విన‌యం చూసి షాక‌య్యాన‌ని చెప్తోంది. ఏ ప‌నినైనా చైతూ 100% చేస్తాడ‌ని శోభిత ఈ సంద‌ర్భంగా తెలిపింది.


చేసే ప‌నిలోనే చైత‌న్య త‌న ఆనందాన్ని వెతుక్కుంటాడ‌ని, దాదాపు రెండు గంట‌ల పాటూ త‌న బైక్ ను తానే క్లీన్ చేసుకుంటాడ‌ని, అది అత‌నికి ఎంతో ఆనందాన్నిస్తుంద‌ని శోభిత తెలిపింది. జీవితంలో ఎన్నో సంఘ‌ట‌న‌లను ఎదుర్కొన్న చైతూ అందులో నుంచి కూడా పాజిటివ్ కోణాన్నే చూస్తాడ‌ని భ‌ర్త గురించి శోభిత చెప్పుకొచ్చింది.


అంతేకాదు, స‌క్సెస్ వ‌చ్చినా ఫెయిల్యూర్ వ‌చ్చినా చైతూ ఎప్పుడూ ఒకేలా ఉంటాడ‌ని, తాను చేసిన సినిమా స‌క్సెస్ అయితే ఎగిరి గంతేయ‌డం, ఫ్లాప్ అయితే మూడీగా ఉండ‌టం లాంటివేవీ చేయ‌డ‌ని, క‌స్ట‌డీ ఫెయిల్ అయిన‌ప్పుడు చైతూ ఎలా ఉన్నాడో, తండేల్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన‌ప్పుడు కూడా తాను అలానే ఉన్నాడ‌ని అంటోంది.

ఇవ‌న్నీ ప‌క్క‌న‌పెడితే అస‌లు చైత‌న్య‌, శోభిత మ‌ధ్య ప‌రిచ‌యం ఎలా ఏర్ప‌డింద‌నే విష‌యాన్ని కూడా ఆమె బ‌య‌ట‌పెట్టింది. ఒక‌రోజు తాను ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ చేస్తున్న‌ప్పుడు తాను నాగ‌చైత‌న్య ను ఎందుకు ఫాలో అవ‌డం లేద‌ని ఓ నెటిజ‌న్ అడిగాడ‌ట‌. ఆ త‌ర్వాత చైతూ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే అత‌ను ఫాలో అవుతున్న 70 మందిలో తాను కూడా ఉండ‌టం చూసి షాకై, అత‌న్ని తిరిగి ఫాలో అయిన‌ట్టు ఆమె వెల్ల‌డించింది.

అలా మెల్లిగా వారి మ‌ధ్య చాటింగ్ జ‌రిగి ఇద్ద‌రికీ ఉన్న కామ‌న్ ఇంట్రెస్ట్ ల గురించి మాట్లాడుకున్నార‌ట‌. తామిద్ద‌రూ ఎక్కువ‌గా ఫుడ్ గురించే మాట్లాడుకునే వారిమ‌ని, చైత‌న్య ఎక్కువ‌గా సుషీ గురించి పోస్ట్ చేసేవాడ‌ని, అది చూసి ఎట్రాక్ట్ అయ్యాన‌ని, మొత్తానికి 2022లో లంచ్ డేట్ కోసం చైత‌న్య త‌న కోసం ముంబై వ‌చ్చాడ‌ని శోభిత వెల్ల‌డించింది. ఆ త‌ర్వాత నుంచి అంద‌రికీ తెలిసిన విష‌య‌మే.

Tags:    

Similar News