కుటుంబంతో సంతోషంగా సన్నిలియోన్ సెలబ్రేషన్!
పిల్లల్ని కనకుండా అనాద పిల్లల్ని దతత్త తీసుకుని సమాజానికి తన వంతు సహాయంగా నిలబడింది.
సన్నిలియోన్ ఇప్పుడు అందమైన కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తుంది. భర్త డేనియల్ వేబర్ తో జీవితాన్ని పంచుకుని ఎంతో సంతోషంగా ఉంది. పిల్లల్ని కనకుండా అనాద పిల్లల్ని దతత్త తీసుకుని సమాజానికి తన వంతు సహాయంగా నిలబడింది. ఆ పిల్లల్నిఎంతో బాగా చదివస్తోంది. అనాధ బాలలైనా కన్న తల్లిదండ్రు ల్లాగే ప్రేమని పంచుతున్నారు.
ఇప్పుడా ఫ్యామిలీ ఎక్కడా కనిపించినా? అదో అద్భుతమైన అందమైన కుటుంబం అంటూ అంతా పొగిడేస్తున్నారు. తాజాగా గణేష్ ఉత్సవాల్నలి సన్నిలియోన్ కుటుంబంతో సంతోషంగా జరుపుకుంది. ఫ్యామిలీ అంతా వైట్ అండ్ వైట్ లో ముస్తాబై పూజలు చేసారు. ఇంట్లోనే పెద్ద వినాయకుడినే సెటప్ చేసారు. గణపతిని ఎంతో అందంగా అలంకరించారు. ఈ దంపతుల పిల్లలక నమస్కారం చేస్తోన్న వైనం ఎంతో మచ్చటేస్తుంది.
వాళ్ల మధ్యలో సన్నిలియోన్ కుడివైపు చివర భర్త కూర్చుని పిల్లలతో గ్రూప్ ఫోటో దిగారు.`భగవంతుడు మన చిన్నారులను ఎల్లప్పుడూ ఎంతో ప్రేమతో ఆశీర్వదిస్తాడు`అనే ఓ వ్యాఖ్యం రాసింది సన్నిలియో. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. అభిమానుల్ని ఆ పిక్ ఎంతో అలరిస్తుంది. అందమైన ఫ్యామిలీ అంటూ పొగిడేస్తున్నారు. ఒకప్పుడు సన్నిలియోన్ పోటో కనిపిస్తే కామెంట్ బాక్సులో రకరకాల కామెంట్లు కనిపించేవి. ఇప్పుడు అందుకు భిన్నంగా సన్నిలియోన్ ఎంతో హుందాగా, గౌరవంగా ముందుకెళ్తున్నారు.
ఇక కెరీర్ పరంగా సన్నిలియోన్ సౌత్ సినిమాలపైనే దృష్టి పెట్టి పనిచేస్తోంది. నార్త్ నుంచి సౌత్ కి షిప్ట్ అయిన నాటి నుంచి సన్నిలియోన్ దూకుడు ఇక్కడ మామూలుగా లేదు. తెలుగులో అవకాశాలంటే రావడ లేదు తప్ప! మిగతా భాషల్లో బాగానే సినిమాలు చేస్తోంది. గత ఏడాది ఒక సినిమాకే పరిమితమైనా ప్రస్తుతం సన్నీ లైనప్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.