ఢిల్లీ మెట్రోలో ఆరాచకం.. హస్తప్రయోగం చేసి మైనర్ బాలికపై స్ఖలనం
రాసేందుకు సైతం చేతి వేళ్లు ససేమిరా అంటున్నాయి. మరీ.. ఇంత ఆరాచకమా?
రాసేందుకు సైతం చేతి వేళ్లు ససేమిరా అంటున్నాయి. మరీ.. ఇంత ఆరాచకమా? సంచలనం కోసం కాదు కానీ.. ఇలాంటి ఉదంతాలకు పాల్పడే ఆరాచకవాదులకు తీవ్రమైన శిక్షలు అది కూడా తత్కాల్ కోటా అన్నట్లుగా విధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి పనులకు పనిష్మెంట్ ఎంత తొందరగా ఉంటే.. తప్పుడు పనులకు పాల్పడే వారికి భయం ఉంటుంది. విన్నంతనే వికారంగా అనిపించే ఈ ఉదంతం ఢిల్లీ మెట్రోలో చోటు చేసుకుంది.
ఇటీవల కాలంలో ఢిల్లీ మెట్రోలో సంచలన ఉదంతాలు చోటు చేసుకోవటం.. అవి కాస్తా వార్తాంశాలుగా మారటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక కామాంధుడి తీరు చూస్తే.. ఒళ్లు మండక మానదు. ఒక కామ పిశాచి హస్తప్రయోగం చేసుకొని.. మైనర్ బాలికపై స్ఖలనం చేసిన ఆరాచక ఘటన తాజాగా చోటు చేసుకుంది. బుధవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఉదంతం షాకింగ్ గా మారటమే కాదు.. ఈ ఉదంతం వైరల్ అయ్యింది. అతగాడిని అరెస్టు చేశారు. ఇంతకూ జరిగిందేమంటే..
బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రెడ్ లైట్ రూట్ లో ఒక మైనర్ బాలిక తన తల్లితో కలిసి ప్రయాణిస్తోంది. రాఖీ పండుగ కావటంతో మెట్రో రైల్ మొత్తం కిక్కిరి ఉంది. ఈ సమయంలో నిందితుడు అత్యంత నీచంగా హస్తప్రయోగం చేసుకొని.. వీర్యాన్ని ఆమెపై స్ఖలనం చేశాడు. దీన్ని గుర్తించిన సదరు బాలిక తల్లి వెంటనే.. సీలంపూర్ మెట్రో స్టేషన్ లో దిగిపోయింది.
రైల్లో ప్రయాణిస్తున్న మిగిలిన ప్రయాణికులు అతడి ఆరాచకాన్ని గుర్తించి.. పట్టుకున్నారు. అనంతరం అతడ్ని మెట్రో అధికారులకు అందజేశారు. నిందితుడు పశ్చిమ బెంగాల్ కు చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. అదుపులోకి తీసుకున్న డిల్లీ మెట్రో అధికారులు.. ఈ నీచుడ్ని షాహదారా స్టేషన్ లో అప్పగించి.. దర్యాప్తు చేపట్టారు. ఒకటి తర్వాత ఒకటి చొప్పున సంచలన ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి.