పక్కా లోకల్ అంటూ ఫీల్డ్ లోకి కేసీఅర్

మరో వైపు చూస్తే కేసీఆర్ ఎందుకు జనంలోకి వస్తున్నారు అంటే పక్కాగా ఒక వ్యూహం ఉందిట. స్థానిక సంస్థలకు ఎన్నికలు 2025 మొదట్లో జరగనున్నాయి.

Update: 2024-10-15 01:30 GMT

భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ నూతన ఉత్సాహంతో కదన రంగంలోకి దూకుతారు అని వార్తలు వస్తున్నాయి. ఆయన సంక్రాంతి తరువాత తెలంగాణాలో జోరుగా పర్యటనలు చేసేందుకు పూర్తిగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు అని అంటున్నారు.

ఎందుకు అలా అంటే దానికి ఒక లెక్క ఉందని అంటున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి తెలంగాణాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అయి ఏడాది కాలం అవుతుంది. దాంతో కేసీఆర్ ఈ ఏడాది పాలన మీద తన దగ్గర అన్ని అస్త్ర శస్త్రాలు సమకూర్చుకుని జనంలోకి వస్తారని అంటున్నారు.

అంటే ఏడాది పాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి టైం ఇచ్చారు అన్న మాట. ఈ ఏడాదిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్లస్సులు మైనస్సులు చూసి వాటి మీద పూర్తి స్థాయి విశ్లేషణ చేస్తారని అంటున్నారు. కేసీఆర్ కేరాఫ్ ఫాం హౌజ్ అని అనుకుంటున్నారేమో అలా కాదు తాను ఇక జనం లోకి అని కేసీఆర్ నయా ప్లాన్స్ తో వచ్చేస్తున్నారు అని చెబుతున్నారు

ఈ ఏడాదితో బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు మధ్య తేడాను ఆయన గుర్తించారని, తమ పాలనలో ఉన్న క్రెడిట్స్ ని జనంలో పెట్టడమే కాకుండా రేవంత్ రెడ్డి పాలనలో డీ మెరిట్స్ ని వెలికి తీసి జనంతోనే వాటి మీద డిస్కషన్ పెట్టించాలని ఒక మాస్టర్ ప్లాన్ వేశారు అని అంటున్నారు.

తెలంగాణా సమాజంలో బీఆర్ఎస్ కి ఇప్పటికీ పట్టు ఉందని అయితే మితిమీరిన హామీలతోనే కాంగ్రెస్ ఆకట్టుకుని అధికారంలోకి వచ్చిందని బీఆర్ ఎస్ అధినాయకత్వం నమ్ముతోంది. అందువల్ల వారి ఆశలకు ఆకర్షణలకు మభ్యపెట్టినా ఆ మబ్బులు విడిపోవడానికి ఏడాది సమయం చాలు అని గులాబీ బాస్ భావిస్తున్నారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే కేసీఆర్ ఎందుకు జనంలోకి వస్తున్నారు అంటే పక్కాగా ఒక వ్యూహం ఉందిట. స్థానిక సంస్థలకు ఎన్నికలు 2025 మొదట్లో జరగనున్నాయి. పెద్ద ఎత్తున జిల్లా పరిషత్తులను కార్పోరేషన్లను గెలుచుకోవడంతో పాటు మండలాలు, పంచాయతీలలో కూడా గులాబీ జెండా ఎగరవేయడం ద్వారా గులాబీ పార్టీదే ఫ్యూచర్ అని చాటి చెప్పడానికే కేసీఅర్ రంగంలోకి దిగుతున్నారు అని అంటున్నారు

దాంతో సంక్రాంతి పెద్ద పండుగ ముగిసిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వంతో ఇక తేల్చుడే అని కేసీఆర్ శిబిరంలో గట్టిగా వినిపిస్తున్న మాటగా ప్రచారంలో ఉంది. కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం కొన్నాళ్ళ పాటు జనంలోకి వచ్చారు.

అయితే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ ని తీవ్రంగా నిరాశ పరచాయి. దాంతో నాటి నుంచి కేసేఅర్ పెద్దగా బయటకు కనిపించడంలేదు. ఈ లోగా బీఆర్ఎస్ కి చెందిన నేతలు అంతా అధికార కాంగ్రెస్ వైపు మళ్లారు. వారిని పిలిచి దిశా నిర్దేశం చేసినా కూడా వెళ్లాల్సిన వారు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఈ క్రమంలో జనంలో పార్టీ ఉంటేనే ఈ కప్పదాట్లకు అడ్డుకట్ట పడేది అన్నది బీఆర్ఎస్ అధినాయకత్వానికి తెలిసి వచ్చింది అని అంటున్నారు

అయితే దానికి సరైన సమయం సందర్భం లోకల్ బాడీ ఎన్నికలే అని గుర్తించిన గులాబీ పార్టీ ఆ దిశగానే ఇపుడు తగిన కార్యారణతో సిద్ధం అవుతోంది అని అంటున్నారు. సో కేసీఆర్ 2025 కొత్త ఏడాది నుంచి జనం మధ్యనే ఉంటారని అంటున్నారు. ఆ విధంగా తెలంగాణా రాజకీయం గేర్ మార్చుకుంటుందని కూడా అంటున్నారు.

Tags:    

Similar News