మోడీ – ట్రంప్ భేటీ... ఇంటర్నేషనల్ మీడియా ఇంటర్ ప్రిటేషన్ వైరల్!
అవును... అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం "అమెరికా ఫస్ట్" అనే నినాదంతో ముందుకు దూసుకుపోతోన్న ట్రంప్ తో భారత ప్రధాని భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ – డొనాల్డ్ ట్రంప్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా.. ఇరువురి నేతల మధ్య ప్రధానంగా సుంకాలు, వాణిజ్యం, రక్షణ ఒప్పందాలపై చర్చ జరిగిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరుదేశాల నేతలు, ప్రజలే కాకుండా.. ప్రపంచ దేశాలు వీరి భేటీని ఆసక్తిగా గమనించాయి.
అవును... అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం "అమెరికా ఫస్ట్" అనే నినాదంతో ముందుకు దూసుకుపోతోన్న ట్రంప్ తో భారత ప్రధాని భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమయంలో వీరి భేటీపై వీరిద్దరూ చెప్పేది వీరు చెప్పగా.. ఇంటర్నేషనల్ మీడియా ఇంటర్ ప్రిటేషన్ ఆసక్తిగా మారింది. ఈ సందర్భంగా ఎవరు ఎలా స్పందిస్తున్నారనేది చూద్దామ్..!
ఈ సందర్భంగా... వీరి భేటీపై బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) తన విశ్లేషణ వినిపించింది. ఇందులో భాగంగా... వాణిజ్య వివాదాలపై అంతగా పురోగతి కనిపించనప్పటికీ... వ్యూహాత్మక సంబంధాలతో పాటు పరస్పర భౌగోళిక రాజకీయ ప్రయోజనాలపై వీరి నిబద్ధతను చాటి చెప్పేందుకు ఇరుదేశాల నేతలు ఈ భేటీని అవకాశంగా మలుచుకున్నారంటూ కామెంట్ చేసింది.
ఇదే సమయంలో స్పందించిన రాయిటర్స్... అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను తీసుకెళ్తామని మోడీ హామీ ఇచ్చిన విషయంతో పాటు ఏఐ, సెమీ కండక్టర్లు, ఖనిజాలు వంటి రంగాలపై ప్రధానంగా చర్చించారని.. ఇదే సమయంలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి $500 బిలియన్స్ కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారని రాసుకొచ్చింది.
ఇదే క్రమంలో... ప్రధానంగా భారత్ తో సైనిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు అమెరికా చూస్తోందని.. పదేళ్ల రక్షణ సహకార ప్రణాళికలో భాగంగానే భారత్ కు ఎఫ్-35 యుద్ధ విమానాలను విక్రయించనుందనే విషయాన్ని ప్రస్థావించింది ఫైనాన్షియల్ టైమ్స్. ఇండో-పసిఫిక్ లో చైనా ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు విస్తృత వ్యూహంగా దీన్ని అభివర్ణించింది.
ఈ సమయంలో బ్లూంబర్ వార్తా సంస్థ.. అమెరికా నూంచి చమురు, గ్యాస్ లను దిగుమతులు పెంచుకోవాలని భారత్ ప్రయత్నిస్తోందని.. ఫలితంగా ప్రతీకార సుంకాల భారాన్ని తగ్గించుకోవాలని భావిస్తుందని పేర్కొంది. బలమైన ఒప్పందాలు ఏమీ లేవని భారత్, అమెరికా విపక్షాలు విమర్శలు చేస్తున్నప్పటీకీ.. ఈ భేటీ సక్సెస్ అని అమెరికా మీడియా సంస్థ ఏబీసీ తెలిపింది!