ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సన్నిహితుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు అనుహ్య ప్రతిఘటన పిలుపువచ్చింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు చుక్కలు చూపెట్టడానికి సిద్ధవుతున్నట్లు హర్యానాలోని జాట్ కమ్యూనిటీ ప్రకటించింది. ఈ నెల 15న హర్యానాలోని జింద్ లో ఓ ర్యాలీలో పాల్గొనడానికి వస్తున్న అమిత్ షాను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున ప్లాన్ వేస్తోంది. ఏకంగా 50 వేల ట్రాక్టర్లతో ఆ ర్యాలీని అడ్డుకోవాలని చూస్తోంది. ఈ వార్త కలకలం రేకెత్తిస్తోంది.
అమిత్ షాకు షాకిచ్చేలా...ఈ భారీ నిరసన చేపట్టడం వెనుక జాట్ల కీలక వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రెండు డిమాండ్లతో జాట్ కమ్యూనిటీ ఈ నిరసన తెలుపుతున్నది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో జాట్ లకు రిజర్వేషన్ కల్పించడం, రెండేళ్ల కిందట ఇదే డిమాండ్ తో చేపట్టిన ఆందోళనల్లో తమ ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవడం.. ఈ రెండు డిమాండ్లను నెరవేర్చాల్సిందేనని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. అమిత్ షా ర్యాలీని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలియగానే హర్యానా ప్రభుత్వం 70 కేసులను ఎత్తేసింది. అయితే - జాట్లు వాళ్లు శాంతించలేదు. అమిత్ షాకు తమ సత్తా ఏంటో చూపిస్తామని అఖిల భారతీయ జాట్ ఆరక్షణ్ సంఘర్ష్ సమితి అధ్యక్షుడు యశ్ పాల్ మాలిక్ స్పష్టంచేశారు. అసలు అమిత్ షా హెలికాప్టర్ కూడా దిగకుండా చూస్తాం. ఒకవేళ దిగినా 50 వేల ట్రాక్టర్లతో ర్యాలీని అడ్డుకుంటాం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తమ సామాజికవర్గం నేతలకు ట్రాక్టర్లతో రావాల్సిందిగా పిలుపునిచ్చాం అని ఆయన తేల్చి చెప్పారు. జాట్ యువతను సమీకరించే పనిలోనే ఇప్పుడాయన రాష్ట్రవ్యాప్త పర్యటన చేపట్టారు. 70 కేసులు ఎత్తేసినా.. ఇంకా 300 కేసులు అలాగే ఉన్నాయని యశ్‌పాల్ చెప్పారు. అవికూడా అమిత్ షా ర్యాలీని అడ్డుకోబోతున్నట్లు తెలిసి ఎత్తేశారని, తమ ఉద్యమకారులపై ఖట్టర్ ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని, బ్రిటీష్ రాజ్ కన్నా అధ్వాన్నంగా చూసిందని యశ్‌పాల్ ఆరోపించారు.
ఇదిలాఉండగా...కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అప్రజాస్వామిక రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ మండిపడ్డారు. ఇవాళ బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ పార్లమెంటరీ కమిటీ సమావేశం జరిగింది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో అనంత్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోడీ మాట్లాడుతుండగా.. రాహుల్ అంతరాయం కలిగించేందుకు ప్రయత్నించాడని కోపోద్రిక్తులయ్యారు. రాఫెల్ ఒప్పందంపై ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని అనంత్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది పలు రాష్ర్టాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు, 2019 సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ నేతలు పని చేయాలని మోదీ సూచించారు. రైతులు - మధ్య తరగతి ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని చెప్పారు.