ఏపీ మంత్రుల కాన్వాయ్ ‌లో ప్రమాదం..తృటిలో తప్పించుకున్న మంత్రులు!

Update: 2020-11-09 12:30 GMT
ఆంధ్రప్రదేశ్ మంత్రులకి ఘోర ప్రమాదం తృటిలో తప్పిపోయింది. నెల్లూరు జిల్లాలో ఈ ప్రమాదంలో మంత్రులు కొద్దిలో పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి టోల్ ప్లాజా దగ్గర మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి - అనిల్ కుమార్ యాదవ్ కాన్వాయ్  ప్రమాదానికి గురైంది. అకస్మాత్తుగా కాన్వాయ్‌ లోని ఓ  వాహనం బ్రేక్ వేయడంతో.. కాన్వాయ్‌ లోని వాహనాలు  ఒకదానికొకటి మూడు వాహనాలు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో మూడు కార్లు ధ్వంసమయ్యాయి. కృష్ణాపురం వద్ద హై లెవల్ కెనాల్ ఫేజ్-2 పైలాన్ ప్రారంభోత్సవానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

అయితే , క్యాన్వాయ్ లోని వెనుక ఉన్న వాహనాలకు ప్రమాదం జరగడంతో ,  మంత్రులు సురక్షితంగా బయటపడ్డారు. ఇక ఆ ప్రమాదం లో  పలువురికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.. వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మంత్రులు అక్కడి నుండి బయల్దేరి వెళ్లి ఆ కార్యక్రమానికి వెళ్లారు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News