ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్రంగా దేశ రాజధాని ఢిల్లీలో మరోమారు హాట్‌హాట్ చర్చ సాగింది. ఇటు పార్లమెంటు ఉభయసభల్లో అటు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం మోడీ నామస్మరణతో మార్మోగిపోయింది. అయితే పార్లమెంటులో వివాదం రూపంలో మోడీ పేరు దద్దరిల్లగా పార్టీ సమావేశంలో నరేంద్ర మోడీపై ప్రశంసల జల్లు కురిసింది. అదే సమయంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ భావోద్వేగానికి గురయ్యారు.
పార్లమెంట్ సమావేశాల విషయానికి వస్తే... ఇవాళ ఉభయసభల్లోనూ విపక్షాలు ఒకే డిమాండ్ చేశాయి. అదే...`ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పాల్సిందే` అనే నినాదంతో. ఈ డిమాండ్ తో రెండు సభలూ దద్దరిల్లాయి. గుజరాత్ ఎన్నికల్లో పాకిస్థాన్ జోక్యం చేసుకుంటోందని ఇటీవల ఆ రాష్ట్ర ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని మోడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ నేతలు పార్లమెంట్‌లో దుమారం లేపుతున్నారు. శీతాకాల సమావేశాల ఆరంభం నుంచే ప్రధాని మోడీ సభలో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. మొదటి రోజు నుంచి వినిపిస్తున్న ఈ గళం ఈ రోజు తారాస్థాయికి చేరింది.
సమావేశాలు ప్రారంభం అయిన సమయం నుంచి మొదలుకొని ఇటు లోక్ సభ, అటు రాజ్యసభలు కూడా మోడీ క్షమాపణల డిమాండ్ తో దద్దరిల్లాయి. దీంతో ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల వరకు ఇరు సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభలో చైర్మన్ వెంకయ్యనాయుడు ఈ అంశంపై మాట్లాడారు. `నిరసన వ్యక్తం చేసే పద్ధతి ఇది కాదు, ఎవరూ క్షమాపణలు చెప్పలేరు - సభలో ఏమీ జరగలేదు - పాక్ జోక్యం చేసుకుందన్న ప్రకటన సభలో చేసింది కాదు` అని చైర్మన్ వెంకయ్యనాయుడు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ విపక్ష సభ్యులు తమ బెట్టు వీడలేదు.
ఇదిలాఉండగా....తన పార్టీ నేతల వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. గుజరాత్- హిమాచల్ ప్రదేశ్ రాష్ర్టాల శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం నేడు నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. గుజరాత్ - హిమాచల్ రాష్ర్టాల్లో అతి పెద్ద విజయం సాధించామని చెప్పారు. ప్రస్తుతం బీజేపీ 19 రాష్ర్టాల్లో అధికారంలో ఉందని తెలిపారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో 18 రాష్ర్టాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉన్నదని గుర్తు చేశారు. 1984లో రెండు ఎంపీ స్థానాలతో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం.. నేటి వరకు అంచెలంచెలుగా ఎదిగిందని మోడీ పేర్కొన్నారు. బీజేపీ నేతలెవరూ ఉదాసీనంగా ఉండొద్దని మోడీ హెచ్చరించారు. ఈ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో గుజరాత్ - హిమాచల్ ప్రదేశ్ రాష్ర్టాలకు సీఎం అభ్యర్థుల ఎంపికపై కూడా చర్చించారు.