ఏపీ రాజధాని ఏది? అనే విషయం రగులుతూనే ఉంది. మూడు రాజధానులు తెస్తామని.. వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. కానీ, ఇప్పటికే.. రాజధాని కోసమని భూములు తీసుకున్నారు కాబట్టి.. అమరావతినే రాజధానిగా గుర్తించాలని.. అభివృద్ధిని పరుగులు పెట్టించాలని ఏపీ హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. అయితే.. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం తన వైఖరినే ద్రుఢ పరుచుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి బొత్స సత్యానారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘2024 వరకు ఏపీ రాజధాని హైదరాబాదే. దాన్ని ఆధారంగా చేసుకునే బహుశా కోర్టులు మాట్లాడి ఉంటాయి. ఎందుకంటే.. రాజధానిని మేం గుర్తించిన తర్వాత.. చట్టం చేసి.. పార్లమెంట్‌కు పంపి.. అక్కడ ఆమోదం పొందిన తర్వాత తెలుస్తుంది. అయితే అమరావతి, హైదరాబాద్ అని రెండు రాజధానులు లేవు. మా ప్రభుత్వం ప్రకారం అమరావతి అనేది శాసన రాజధాని మాత్రమే. ఇప్పటికీ హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉంది’ అని బొత్స వ్యాఖ్యానించారు.
అయితే బొత్స చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఇప్పటికే అమరావతే రాజధాని అని అక్కడ్నుంచే అన్ని కార్యకలపాలు సాగించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది.
మరోవైపు మూడు రాజధానులు కట్టాలా..? వద్దా..? అని జగన్ సర్కార్ ఆలోచనలో పడింది. ఈ క్రమంలో బొత్స చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. అంతేకాదు.. పొరుగున ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ వ్యాఖ్యలతో పెద్ద ఎత్తున లాభం ఒనగూరే అవకాశం ఉందని కూడా అంటున్నారు మేధావులు.
తెలంగాణ సెంటిమెంటుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి.. రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించే కేసీఆర్.. ఇప్పుడు బొత్స చేసిన వ్యాఖ్యలతో మరోసారి.. తెలంగాణ సెంటిమెంటును తెరమీదికి తెచ్చే ప్రయత్నం చేస్తారని చెబుతున్నారు. ఎలాగంటే.. ``అదిగో.. ఆంద్రోళ్లు మన హైదరాబాద్‌లో వాటా అడుగుతున్నారు. మనం మన రాష్ట్రాన్ని , రాజధానిని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అది ఒక్క టీఆర్ ఎస్‌తోనే సాధ్యమవుతుంది`` అని ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు.
గత 2018 తెలంగాణ ఎన్నికల్లోనూ ఇదే తరహాలో కేసీఆర్ రాజకీయ విన్యాసం చేసి.. విజయం దక్కించుకున్నారు. అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు.. కాంగ్రెస్‌తో జట్టు కట్టి.. తెలంగాణలో పోటీ చేశారు. దీంతో ఇంకేముంది.. మళ్లీ మన మీద పెత్తనం చేసేందుకు ఆంధ్రోళ్లు వచ్చేశారంటూ.. కేసీఆర్ ఊరూవాడా ప్రచారం చేసి.. సెంటిమెంటును రగిలించారు.
దీంతో ఏం జరిగిపోతుందో అనే భయంతో ఇక్కడి ప్రజలు మరోసారి ఇష్టం ఉన్న లేకున్నా.. కేసీఆర్‌కు పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ అసలు అధికారంలోకి వచ్చే అవకాశం లేదని భావించిన సందర్భంలో భారీ మెజారిటీతో మరోసారి అధికారం దక్కించుకున్నారు.
ఇక, ఇప్పుడు కూడా త్వరలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని సంకేతాలు వస్తున్న క్రమంలో ఏపీలోని అధికార పార్టీ హైదరాబాదే మన ఉమ్మడి రాజధాని అని ప్రకటించడం.. కేసీఆర్‌కు కలిసి వచ్చేఅ వకాశం ఉందని మేధావి వర్గాలు అంచనా వేస్తున్నారు.
అంటే.. హైదరాబాద్‌లో వాటా అడుగుతున్నారని.. తమ తెలంగాణను కాపాడు కోకపోతే.. మళ్లీ రాష్ట్రాన్ని కకూడా కలిపేసుకునే ప్రమాదం ఉందని ఆయన ప్రజల్లోకి వెళ్లడం ఖాయమని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.