ఇలాంటి మాట‌లు బాబు మాత్ర‌మే చెప్ప‌గ‌ల‌రేమో?

Update: 2019-07-04 04:38 GMT
ఐదేళ్లుగా ముఖ్య‌మంత్రి. ఆ మాట‌కు వ‌స్తే.. దాదాపు ప‌ద్నాలుగున్న‌రేళ్లుగా రాష్ట్రానికి సీఎం. యుద్ధ ప్రాతిప‌దిక‌న ప్రాజెక్టును పూర్తి చేశార‌న్న పేరు ప్ర‌ఖ్యాతులు.. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీని హైద‌రాబాద్ కు తెచ్చార‌న్న బ‌డాయి.. సైబ‌రాబాద్ అన్న న‌గ‌రాన్నే అభివృద్ధి చేశార‌న్న గొప్ప‌లు చెప్పుకునే చంద్ర‌బాబుకు తాను సుదీర్ఘ‌కాలంగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గానికి నీళ్లు తేవ‌టానికి ఇన్నేళ్లు ప‌ట్ట‌ట‌మా? అన్న ఆశ్చ‌ర్యం క‌లుగ‌క మాన‌దు.

ప‌వ‌ర్లో ఉన్న‌ప్పుడు క‌నిపించ‌ని సొంత నియోజ‌క‌వ‌ర్గం.. ప‌వ‌ర్ పోయినంత‌నే అది చేయాలి.. ఇది చేయాల‌న్న మాట‌లు చెప్ప‌టం చంద్ర‌బాబుకు మాత్ర‌మే సాధ్య‌మ‌ని చెప్పాలి. తాజాగా కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన మాట‌ల్ని వింటే అవాక్కు అవ్వాల్సిందే.

కుప్పానికి నీళ్లు తెచ్చేందుకు ట్రై చేశాన‌ని.. పులివెందుల‌కు నీళ్లిచ్చి..ఆ త‌ర్వాతే కుప్పానికి నీళ్లు తెచ్చానంటూ త‌న‌కు అంద‌రూ స‌మాన‌మ‌న్న మాట‌ను చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌త్య‌ర్థి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పులివెందుల‌కు నీళ్లు తెచ్చాన‌ని.. కాబ‌ట్టి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబ‌ట్టి కుప్పానికి నీళ్లు తీసుకురావాల‌న్న మాట చెప్ప‌టానికి బాబుకు నోరెలా వ‌చ్చిందో అన్నది ఒక ప‌ట్టాన అర్థం కాదు.

ఎందుకంటే.. ముఖ్య‌మంత్రిగా ఉన్న వ్య‌క్తికి రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేయాల‌న్న ఆలోచ‌న ఉంటుంది. అదే స‌మ‌యంలో తాను ప్రాతినిధ్యం వ‌హించే నియోజ‌క‌వ‌ర్గాన్ని మోడ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంగా చేయాల‌న్న త‌లంపు ఉంటుంది. ఎందుకంటే.. సొంతూరుకు.. సొంత నియోజ‌క‌వ‌ర్గానికి పిస‌రంతైనా ఎక్కువ చేయాల‌న్న భావ‌న ఉండ‌టం త‌ప్పేంకాదు. ఎందుకంటే.. మిగిలిన ఎమ్మెల్యేల మాదిరి ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న వ్య‌క్తి నిత్యం నియోజ‌క‌వ‌ర్గం గురించి ఆలోచించ‌టానికి స‌మ‌యం ఉండ‌దు. అందుకే.. చేయాల్సిన దాని కంటే ఎక్కువ చేసే ప్ర‌య‌త్నం చేస్తారు.

సుదీర్ఘ‌కాలం ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించి.. ఇప్పుడున్న హైద‌రాబాద్ కు తానే కార‌ణ‌మ‌న్న గొప్ప‌లు చెప్పే బాబుకు.. త‌న‌ను అదే ప‌నిగా గెలిపించే కుప్పం నియోజ‌క‌వ‌ర్గానికి క‌నీసం నీళ్లు ఇవ్వాల‌న్న ధ్యాస లేక‌పోవ‌టాన్ని ఏమ‌నాలి? ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వాలంటారు. త‌న‌ను గెలిపించిన కుప్పానికి నీళ్లు ఇవ్వ‌ని చంద్ర‌బాబు.. ఏదేదో అద్భుతాలు చేస్తే ఏం లాభం?

సొంత ప్ర‌జ‌ల నీటి అవ‌స‌రాలు తీర్చ‌లేని నేత‌.. ఎంత మొన‌గాడైతే ఏం లాభం. ఇవాల్టి రోజున సీఎం ప‌ద‌వి పోయిన త‌ర్వాత‌.. కుప్పం ద‌గ్గ‌ర్లోకి నీళ్లు తేగ‌లిగాన‌ని.. ఆ మిగిలింది పూర్తి చేయాల‌న్న మాట చెప్పేందుకు నోరెలా వ‌చ్చింది చంద్ర‌బాబు అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. సీఎంగా అంత ప‌వ‌ర్ ఉంచుకోని.. సొంతోళ్ల‌కు నీళ్లు ఇవ్వ‌లేని చంద్ర‌బాబు లాంటోడిని అదేప‌నిగా గెలిపించే కుప్పం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు హేట్సాఫ్ చెప్పాల్సిందే. 
Tags:    

Similar News