కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న75 జిల్లాలను మార్చి 31 వరకు లాక్ డౌన్ చేయాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగు తుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూకు ఇచ్చిన పిలుపుకు ప్రజలు సహకరించిన నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జరీచేశారు. 75 జిల్లాలలో అత్యవసర సేవలు మినహా సర్వీసులు పూర్తిగా స్తంభింపజేశారు.
ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు మహారాష్ట్రలో 144 సెక్షన్ విధించారు. మహారాష్ట్రలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు. మార్చి 31వరకు ఈ నిబంధన అమలులో ఉంటుందని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈనెల 31వరకు రాష్ట్రాలను లాక్ డౌన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనితో తెలుగు రాష్ట్రాలలో జన జీవనం పూర్తిగా స్తంభించి పోయింది. ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించడంతో, ఇంట్లో నుండే పనులు చేయడం లో నిమగ్నమై పోయారు. ఎవరూ బయటకు రావడం లేదు.
ఇకపోతే , మరోవైపు అంతరాష్ట్రాల సరిహద్దులను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మూసివేయడంతో రాష్ట్ర సరిహద్దుల్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కార్లు, లారీలు కంటైనర్లను సరిహద్దుల్లోనే పోలీసులు ఆపేస్తున్నారు. నిత్యావసర సరుకులు తీసుకువచ్చే వాహనాల్ని తప్ప , వేరే ఏ వాహనాలని కూడా అడుగుపెట్టనివ్వడంలేదు. ఇక తెలంగాణ రాష్ట్ర సరిహద్దైన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డులో చెక్ పోస్టు వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వాహనాలను రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. లారీలు, డీసీఎం వంటి వాహనాలను పక్కనే ఉన్న వెంచర్ లో పార్కింగ్ ఏర్పాటు చేసి నిలిపేస్తున్నారు. చాలా మంది కార్లు వేసుకొని రాష్ట్రంలోకి వచ్చేందుకు ప్రయత్నించగా వారిని కూడా అనుమతించడం లేదు. మరోవైపు సరిహద్దు ప్రాంతాల్లో నిలిపివేసిన లారీ డ్రైవర్లకు, క్లీనర్లకు రవాణా శాఖ అధికారులు భోజన ఏర్పాట్లు చేశారు. ఎవరకీ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈనెల 31 వరకు లాక్ డౌన్ కొనసాగుతుండటంతో రాష్ట్రంలోకి వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టం చేశారు.