పదేళ్లుగా భార్యకు డ్రగ్స్ ఇచ్చి.. పరాయివాళ్లతో రేప్ చేయించేవాడు

Update: 2023-06-23 05:00 GMT
భర్తను నమ్మని భార్య ఉంటుందా? ఆమెనుు కంటికి రెప్పలా చూడాల్సిన వాడే.. అందుకు భిన్నంగా మాటల్లో చెప్పలేని అరాచకానికి పాల్పడిన ఘోరం ఒకటి తాజాగా వెలుగు చూసింది. విన్నంతనే వికారం పుట్టించే ఈ దారుణ ఉదంతం ఫ్రాన్స్ లో చోటు చేసుకుంది.

పోలీసులు వెల్లడించిన ఈ వివరాలు ఇప్పుడు షాక్ కు గురి చేస్తున్నాయి. ఫ్రాన్స్ కు చెందిన డొమినిక్ అనే వ్యక్తి తన భార్యకు రాత్రిళ్లు యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్ ను ఆమెకు తెలీకుండా ఆహారంలో కలిపి ఇచ్చేవాడు. ఆమె మత్తులోకి జారిపోయిన తర్వాత.. ఇంటికి కొందరు వ్యక్తుల్ని రప్పించి..ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతుంటే రహస్యంగా వీడియోలు తీసేశాడు.

ఇలాంటి హింస పదేళ్ల పాటు సాగింది. 2011 నుంచి 2020 వరకు జరిగిన ఈ ఆరాచకం పోలీసుల వరకు తెలిసే వరకు.. బాధితురాలికి తెలీయకపోవటం గమనార్హం. ఆమెపై అత్యాచారాలకు పాల్పడిన వారిలో 51 మందిని గుర్తించారు. మొత్తం 91 సార్లు ఆమెపై లైంగిక దాడి జరిగినట్లుగా భావిస్తున్నారు.

ఆమె పై లైంగిక దాడికిపాల్పడిన వారి వయసు 26-73 ఏళ్ల మధ్యలో ఉంది. వివిధ నేపథ్యాలున్న వారిని అతడు ఇంటికి తీసుకొచ్చేవాడు. ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు.. ఇంటికి వచ్చే వారు ఎలాంటి ఫెర్ ఫ్యూమ్స్ వాడకుండా జాగ్రత్తలు తీసుకునేవారు.

పొద్దుపోయిన తర్వాత ఇంటికి పరాయి వ్యక్తుల్ని ఇంటికి రప్పించటంతో పాటు.. ఇరుగుపొరుగు వారికి అనుమారం రాకుండా ఉండేవాడు. ఇంటికి వచ్చే వారి వాహనాల్ని చాలా దూరంగా ఆపించేవాడు. తాను తీసిన వీడియోల్ని రహస్యంగా దాచేవాడు. చివరకు ఈ విషయం పోలీసులకు చేరటం.. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకోవటంతో.. భర్త చేసిన నీచాతినీచమైన పనులు తెలిసిన ఆ భార్య గుండె బద్ధలైంది.

ఇప్పటికే శారీరక సమస్యల్ని ఎదుర్కొంటున్నఆమ... తీవ్రమైన ఆందోళనలో మునిగిపోయింది. విడాకులకు దరఖాస్తు చేసుకుంది. తను చేసిన దారుణాన్ని సదరు భర్త సమర్థించుకుంటున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.

Similar News