చెస్ క్రీడాకారిణిగా సుపరిచితురాలు.. చిన్న వయసు నుంచే వరుస విజయాలతో జాతీయ.. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించిన ద్రోణవల్లి హారిక పెళ్లికూతురయ్యింది. ఏపీకి చెందిన హారిక బాల్యం నుంచే చెస్ ప్లేయర్ గా మంచి పేరు తెచ్చుకుంది.
ఆమె వివాహాన్ని తాజాగా పెద్దలు నిర్ణయించారు. సివిల్ ఇంజనీర్ అయిన కార్తీక్ చంద్రతో ఆమె వివాహం ఈ నెల 18న హైదరాబాద్‌లో జరగనుంది. ఇక.. పెళ్లి ఆగస్టు 19న జరపాలని నిర్ణయించారు.
2008లో జూనియర్ ప్రపంచ చాంపియన్ గా ఆవతరించిన ఆమె.. 2011లో గ్రాండ్ మాస్టర్ హోదాను సాధించింది. కామన్వెల్త్.. ఆసియా చాంపియన్ గా నిలిచిన హారిక 2012.. 2015.. 2017లలో జరిగిన వర్డల్ చాంపియన్ షిప్ లలో కాంస్య పతకాల్ని సాధించింది.