ఐఏఎస్ అధికారిణి అమ్రపాలికి 1210 గజాల స్థలమిస్తూ జీవో జారీ

Update: 2019-11-14 06:23 GMT
ఐఎస్ అధికారులు చాలామంది ఉన్నా కొందరు ఏదో ఒక కారణం చేత వార్తల్లో నిలుస్తుంటారు. అలాంటి కోవకే చెందుతారు ఐఏఎస్ అధికారిణి అమ్రపాలి. ఇటీవలే కేంద్ర సర్వీసులకు వెళ్లిన ఆమె.. మరో అంశానికి సంబంధించి వార్తల్లోకి వచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి వద్ద ఓఎస్డీగా పని చేస్తున్న అమ్రపాలి కుటుంబానికి ప్రభుత్వం 1210 గజాల స్థలాన్ని కేటాయించింది.

దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వును జారీ చేశారు. ఇంతకీ అమ్రపాలికి ఈ స్థలాన్ని ప్రభుత్వం ఎందుకు కేటాయించింది? ఎంతకు కేటాయించింది? అన్న వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా కొత్రేపలిలో అమ్రపాలి తల్లి పద్మావతి పేరుతో 4.27 ఎకరాల స్థలం ఉంది. దీనికి అప్రోచ్ రోడ్డు లేదు.

దీని కోసం 1210 గజాల స్థలం అవసరమైంది. ప్రభుత్వ భూమిగా ఉన్న నేపథ్యంలో దాన్ని రూ.4లక్షలకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే.. 1210 గజాల స్థలాన్ని రూ.4లక్షలకు కొనుగోలు చేయటం ద్వారా.. తన తల్లి పేరుతో ఉన్న 4.27 ఎకరాల భూమికి అప్రోచ్ రోడ్డును అమ్రపాలి పొందగలిగిందంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వును రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తాజాగా విడుదల చేశారు.
Tags:    

Similar News