అయోధ్య మందిరానికి బంగారు ఇటుక ఇస్తానన్న మొఘల్ రాజవంశీకుడు

Update: 2019-08-19 05:37 GMT
అయోధ్యలోని వివాదాస్పద భూమిలో మందిరాన్ని నిర్మించాలా? మసీదును నిర్మించాలా? ఈ రెండూ కాకుండా యధాతథ స్థితిని కొనసాగించాలా? అన్న క్వశ్చన్లు సుదీర్ఘకాలంగా సాగుతున్నవే. డైలీ బేసిస్ లో ఈ విషయాన్ని తేల్చేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్ తెగ ప్రయత్నిస్తోంది.ఇందులో భాగంగా ఇటీవల సంచలన వ్యాఖ్య కూడా చేసింది కూడా. రాముడి వంశీకులు దేశంలో ఎవరైనా ఉన్నారా? అన్న కోర్టు మాటకు ఇప్పటికే ఐదుగురు రాజవంశీకులు ఒకరి తర్వాత ఒకరుగా తాము రాముడి వంశీకులుగా చెప్పారు.

ఒక బీజేపీమహిళా ఎంపీ అయితే.. ఏకంగా తాము రాముడి వంశస్తులమన్న మాటకు సంబంధించి లిఖిత పూర్వక ఆధారాలు ఉన్నట్లుగా చెప్పి మరింత ఆశ్చర్యానికి గురి చేశారు. అయోధ్యలోని వివాదాస్ప స్థలంలో ఏర్పాటు చేయాల్సిన కట్టడానికి సంబంధించి తాజాగా మొఘల్ వంశీకులకు చెందిన వారసుడి ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. వివాదాస్పద భూమిని తనకు అప్పగించాలన్నారు. అలా చేస్తే.. అయోధ్యలో మందిర నిర్మాణానికి తానే తొలి ఇటుకను ఇస్తానని చెప్పారు. అది కూడా బంగారు ఇటుకను బహుకరిస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ కు ఆరో వారసుడిగా చెప్పుకునే 50 ఏళ్ల హబీబుద్దీ టూసీ.. వివాదాస్పద స్థలంలో అయోధ్య మందిరాన్ని నిర్మించి అప్పగిస్తానని చెబుతున్నారు. అయోధ్యలో రాముడి ఆలయాన్ని నిర్మించాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతున్న వేళ.. ఏ మొఘల్ చక్రవర్తుల కారణంగా సదరు కట్టడం స్థానంలో మసీదు వచ్చిందో.. ఇప్పుడు అదే వంశీకుల వ్యక్తే స్వయంగా ముందుకొచ్చి మందిరాన్ని నిర్మించేందుకు సిద్ధమని చెప్పటం విశేషంగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News