ప్రధాని నరేంద్రమోదీ తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు కఠోరదీక్ష - దక్షతతో పని చేస్తాడనే పేరుంది. అయితే తాను రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం ముందుకు పోతారనే పేరుకూడా ఉంది. తాను నమ్మిన సిద్దాంతం - తాను చేయదలుచుకున్న పనులు ఎన్ని అడ్డంకులు వచ్చినా - ఎవ్వరు అడ్డం చెప్పినా వినకుండా ముందుకు పోవడమే ప్రధాని నరేంద్రమోదీ నైజమట. తన లక్ష్యాలను పూర్తి చేసే సైన్యాన్ని తయారు చేసుకుని కొన్నింటిని చాపకింద నీరులా అమలు చేయడం - మరికొన్నింటిని బహిరంగంగానే తన అనుచరులతో చేత చేయించడంలో మోదీ దిట్ట.
అందుకే నరేంద్రమోదీ ఎప్పుడు ఏమీ చేయాలో.. ఎక్కడ ఏమీ మాట్టాడాలో.. ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తర్కించి నిర్ణయాలు తీసుకుంటాడనే ప్రతీతి. అందుకే ప్రధానిగా దాదాపు ఐదేండ్లు విజయవంతంగా పూర్తి చేసుకుని రెండో టర్మ్ అధికారంలోకి రాగానే తన లక్ష్యాలను చేరుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు.. అందులో కరసేవకులు - ఆర్ ఎస్ ఎస్ చిరకాల స్వప్నం రామమందిరం. ఈ వివాదస్పద రామమందిరం గురించి ఇంతకాలం మౌనంగా ఉన్న ప్రధానమంత్రి మోదీ ఇప్పుడు నోరు విప్పి సంచలన కామెంట్లు చేశారు.
రామమందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును విశ్వసిద్దాం.. అంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రెండు - మూడు వారాలుగా కొంతమంది.. రామమందిరం అంశంపై ఉన్నవీ లేనివీ మాట్లాడుతున్నారని - అయితే.. మనం సుప్రీంకోర్టును గౌరవించడం తప్పనిసరి అని అన్నారు. దేశ రాజ్యాంగంపైన - న్యాయవ్యవస్థపైనా మనకు విశ్వాసం ఉండాలన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నాసిక్‌లో నిర్వహించిన మహా జనాదేశ్ యాత్ర ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు మోదీ.
రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం.. కశ్మీరీలను ప్రేమతో హత్తుకుందాం.. కశ్మీర్ లోయలో సరికొత్త స్వర్గాన్ని సృష్టిద్దాం అంటూ మోదీ పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో అటు కశ్మీర్ ప్రజలను మెప్పించడం - మరోవైపు మహారాష్ట్ర ప్రజలను తనవైపు తిప్పుకోని అసెంబ్లీ ఎన్నికల్లో హిందూత్వ ఏజెండాను పక్కా అమలు చేస్తామని భరోసా ఇవ్వడం అనే ఎత్తుగడలను ఎన్నుకున్నాడు మోదీ.
రాముడు పుట్టిన అయోధ్యలో రామాలయ నిర్మాణంపై శివసేన బీజేపీ అధికారంలోకి వచ్చిన్పటి నుంచే అంటే ఐదేండ్లుగా పదేపదే డిమాండ్ చేస్తోంది.
రామ మందిరం అంశం 1992 నుంచి కొనసాగుతూనే ఉందని.. ఇంకెన్నాళ్లు వేచి ఉండాలని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఇటీవల వ్యాఖ్యానించారు.. కోర్టు ఆదేశాల కోసం వేచి చూడకుండా.. ఆర్టికల్ 370పై ధైర్యంగా నిర్ణయం తీసుకున్నట్టే కేంద్రం రామమందిరంపైనా కూడా ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలని.. ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి అయోధ్యలో ఆలయాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు.. అయితే, శివసేన పేరు ప్రస్తావించకుండా ఈ వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ.. రెండు మూడు వారాలుగా కొంతమంది.. రామమందిరం అంశంపై ఉన్నవీ లేనివీ మాట్లాడుతున్నారు.
కానీ, మనం సుప్రీంకోర్టును గౌరవించడం తప్పనిసరి. ఎందుకంటే ఆ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఆ కేసుకు సంబంధించి అన్ని పక్షాలూ కోర్టులో తమతమ వాదనలు వినిపిస్తున్నాయని తెలిపారు. అంటే ప్రధాని నరేంద్రమోదీ రామమందిరం నిర్మాస్తామని అన్యాపదేశంగా చెపుతూనే చట్టాన్ని గౌరవిద్దామని ముక్తా ఇస్తున్నారు. అంటే మోదీ మదిలో రామమందిర నిర్మాణంపై పక్కా క్లారిటీతో ఉన్నాడనే అర్థం.