అమెరికాలో అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఫలితాలను ప్రభావితం చేసేందుకు రష్యా హ్యాకింగ్ కు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలను ఆ అధ్యక్షుడు పుతిన్ ఖండించారు. అయితే కొందరు దేశభక్తులైన హ్యాకర్లు ఆ పని చేసిఉండొచ్చని అభిప్రాయపడ్డారు. రష్యాకు చెడ్డపేరు తెచ్చేందుకు కొందరు రష్యన్ హ్యాకర్ల పేర్లు చేర్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. జర్మనీ ఎన్నికల్లోనూ ఫలితాలను ప్రభావితం చేసేందుకు రష్యన్ హ్యాకర్లు ప్రయత్నిస్తారా? అన్న ప్రశ్నకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అలాంటి పనికి పాల్పడబోదని స్పష్టం చేశారు.
ఇదిలాఉండగా...భారత్ - రష్యా రక్షణ సహకారం కొత్తపుంతలు తొక్కింది. సరఫరాల దశనుంచి ఉమ్మడి అభివృద్ధి - సంయుక్త ఉత్పాదన దిశగా దూసుకుపోతున్నది. రక్షణ సహకారాన్ని మరింత ఉన్నతస్థాయికి తీసుకువెళ్లాలని భారత్ - రష్యా అంగీకారానికి వచ్చాయి. కీలక సైనిక పరికరాల తయారీని ఉమ్మడిగా అభివృద్ధి చేసి కలిసి తయారు చేయాలని తీర్మానించుకున్నాయి. తమిళనాడులోని కుడంకుళం అణు కేంద్రంలోని చివరి రెండు యూనిట్ల నిర్మాణంపై రెండు దేశాలు విధివిధానాలు ఖరారు చేశాయి. ప్రధాని నరేంద్రమోడీ - రష్యా అధ్యక్షుడు వ్లదీమిర్ పుతిన్ వాణిజ్యం - రక్షణ సహకారంతోపాటుగా వివిధ అంశాలపై మొత్తం ఐదు ఒప్పందాలపై సంతకాలు చేశారు. అందులో కుడంకుళం ఒప్పందం ప్రముఖంగా నిలిచింది.
వార్షిక ద్వైపాక్షిక శిఖరాగ్రసభలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ రష్యాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఉభయదేశాల నేతలు మీడియా హల్ చల్ కు దూరంగా సుదీర్ఘ మంతనాలు సాగించారు.వాణిజ్య విస్తరణ దిశగా యురేషియన్ ఎకనామిక్ యూనియన్ ఏర్పాటు అంశం ఈ చర్చల్లో ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తున్నది. స్వతంత్ర క్రెడిట్ రేటింగ్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఉభయపక్షాలూ అంగీకరించాయి. ప్రస్తుత గ్లోబల్ రేటింగ్ వ్యవస్థలు అమెరికా, చైనాల వైపు మొగ్గు చూపుతాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కీలక అంశం భారత - రష్యా చర్చల్లో ప్రస్తావనకు రావడం గమనార్హం. అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో నేతలిద్దరూ మాట్లాడారు. రెండుదేశాల సన్నిహిత మైత్రిని నొక్కిచెప్పారు. విద్యుత్ - ఇంధన రంగాల్లో సహకారాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య ఇంధన వారధి నిర్మించేందుకు మేం కృషి చేస్తాం.. కుడంకుళం అణుకేంద్రంలో చివరివైన 5 - 6 యూనిట్ల నిర్మాణంపై సాధారణ నిబంధన ఒప్పందం - రుణవిధానంపై ఏకాభిప్రాయం కుదరడం హర్షదాయకం అని ప్రధాని మోదీ అన్నారు. రెండు యూనిట్ల ఉత్పాదక సామర్థ్యం వెయ్యేసి మెగావాట్ల చొప్పున ఉంటుంది. శిఖరాగ్ర చర్చల సందర్భంగా 21వ శతాబ్దపు దార్శనిక పత్రం కూడా విడుదల చేశారు. ప్రపంచదేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించరాదని అందులో విజ్ఞప్తి చేసారు. ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఖండిస్తున్నట్టు అందులో తెలిపారు. వైమానిక రంగంలో సహకారాన్ని విస్తరించుకోవాలని రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి. 2020 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వైమానిక రంగంగా భారత్ అభివృద్ధి చెందుతుందని దార్శనిక పత్రంలో పేర్కొన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/