రష్యా అధ్యక్షుడి విమానమా.. మాజాకా..

Update: 2018-07-18 14:30 GMT
ప్రపంచంలో అమెరికా తర్వాత అతిపెద్ద దేశం రష్యానే.. ఆయుధాలు, మిలట్రీ, రక్షణ విషయంలో అమెరికాతో నువ్వా నేనా అన్నట్టు పోటీపడుతుంది. ప్రచ్చన్న యుద్ధకాలంలో అయితే అమెరికా, రష్యాలు కత్తులు నూరుకున్నాయి. కానీ రష్యా కు మిత్రదేశాలు దూరమవడం.. ఆ తర్వాత కొన్ని ఒడిదొడుకులతో వెనుకబడిపోయింది. అయితే రష్యాను ఏకచ్చత్రాధిపత్యంగా పాలిస్తూ అధ్యక్షుడు పుతిన్ తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఆయన  రక్షణకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారని తాజాగా కొన్ని నిజాలు బయటపడ్డాయి.

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవలే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కలిశాడు.  ఈ టూర్ గురించి ప్రపంచవ్యాప్తంగా అంతటా ఆసక్తి నెలకొంది. ఇద్దరు అగ్ర దేశాధినేతల సమావేశం కావడంతో మీడియా మొత్తం ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలోనే పుతిన్ విమానంకు సంబంధించిన పలు ఫోటోలు విడుదలయ్యాయి. ఆ పిక్స్ బయటకు రావడం .. అందులో రక్షణ, సౌకర్యాలు చూసి అందరూ నోరెళ్లబెట్టారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పుతిన్ విమానం సంగతులపైనే చర్చ నడుస్తోంది.

పుతిన్ ప్రయాణిస్తున్న విమానం ఖరీదు 3534 కోట్ల రూపాయలట.. సాధారణ విమానం మాదిరిగా కనిపించినా అందులో అత్యాధునిక టెక్నాలజీ ఉంది. ఊహించని పరిస్థితులు ఎదురైతే ఈ విమానం నుంచి మిలట్రీకి ఆదేశాలు వెళతాయి. అడ్వాన్సుడ్ కమ్యూనికేషన్స్ సిస్టం, ఆఫీసు, బెడ్ రూం, జిమ్, హాల్ వంటి అత్యాధునిక సదుపాయాలున్నాయి. ఈ విమానం గంటకు 901 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. తాజాగా విడుదలైన విమానం లోపలి ఫొటోలు చూసి రష్యా అధ్యక్షుడి విలాసవంతమైన జీవితం గురించి అందరూ చర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News