ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రామాయణ మ్యూజియం అంశాన్ని ఇటీవల తెరపైకి తెచ్చింది బీజేపీ! వివాదాస్పద బాబ్రీమసీదు - రామజన్మభూమి స్థలానికి 15 కిలోమీటర్ల దూరంలో రామాయణ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈమేరకు ప్రతిపాదిత స్థలాన్ని కేంద్ర మంత్రి మహేష్ శర్మ సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కి సొంత పార్టీ ఎంపీ నుంచే తాజాగా విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై రాజకీయ ప్రత్యర్ధులు ఇది మంచి పరిణామం కాదని - ఎన్నికల వేల ఇలాంటి చీప్ ట్రిక్సా అని రకరకాల కామెంట్స్ చేస్తుంటే... అసలు ఈ మ్యూజియం ఏర్పాటు అంత గొప్పదేమీ కాదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వినత్ కతియార్ అంటున్నారు. తాము అడిగింది రామమందిర నిర్మాణం అయితే కేంద్ర ప్రభుత్వం "లాలీపాప్"తో సరిపెట్టేస్తోంది అని వ్యాఖ్యానించారు. అయోధ్యలో తాను ఎక్కడికి వెళ్లినా... రామమందిరం ఎప్పుడు కడతారు అని సాధువులు తనను అడుగుతున్నారని, అలాంటి పరిస్థితుల్లో రామాలయం కావాలంటే మ్యూజియం అంటూ లాలీపాప్ ఇస్తున్నారని కతియార్ అంటున్నారు.
కాగా, 1990 అయోధ్యలో రామాలయ నిర్మాణ ఉద్యమకర్తల్లో ఒకరైన కతియార్.. ఈ అంశంలో మరో బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి వాదనకు కతియార్ మద్దతుగా నిలుస్తున్నారు. గతంలోకూడా.. సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురుచూడకుండా సమస్య పరిష్కారానికి మోడీ ప్రభుత్వం కృషి చేయాలని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఈ ఏడాది ప్రారంభంలో సుబ్రమణ్యం స్వామి ఈ అంశాన్ని రాజ్యసభలోనూ లేవనెత్తారు. 2017 ఎన్నికల్లో గెలవాలంటే రామాలయం అంశం కీలకమని అన్నారు. అయితే అభివృద్ధిని నమ్ముకుని ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లాలి కానీ ఇలాంటి కార్యక్రమాలతో కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/