గాంధీ ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు నడపటం అంత చిన్న విషయమేమీ కాదు. నిజానికి అలాంటి అవకాశం అందరికి లభించదు. గాంధీ ఫ్యామిలీ మెంబర్స్ తో దగ్గరగా గడిపే అవకాశం.. వారికి సన్నిహితంగా ఉండటం సాధ్యమయ్యేది కాదు. కానీ.. అలాంటి అవకాశం తనకు లభించిందని తరచూ చెబుతుంటారు ఇప్పటి టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు. స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన ఈ గుంటూరు జిల్లా రాజకీయ నాయకుడు గాంధీ ఫ్యామిలీతో తనకున్న సాన్నిహిత్యాన్ని మరోసారి చెప్పుకునే ప్రయత్నం చేశారు.ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు చాలానే వచ్చాయి.
ఇందిరాగాంధీ ఇంటికి వెళ్లేవాడినని.. రాజీవ్ బెంజ్ కారు తోలితే.. ఆయన పక్కనే కూర్చొనేంత దగ్గరితనం ఉందని.. రాజీవ్ కు సొంత అన్నలా ఉండేవాడినని.. అపాయింట్ మెంట్ లేకుండా వెళ్లే తనలో లాస్ట్ 30 ఇయర్స్ కాంగ్రెస్ బ్లడ్ ఉండేదని.. ఇప్పుడు మాత్రం లేదని తేల్చేశారు. గాంధీ ఫ్యామిలీ తనకు ద్రోహం చేసిందన్న రాయపాటి.. ఎలాంటి ద్రోహం అన్న మాటకు మాత్రం బదులివ్వకపోవటం గమనార్హం.
ఇందిరా.. రాజీవ్ లు ఉంటే తనలో కాంగ్రెస్ బ్లడ్ ఉండేదని.. వారు లేకపోవటంతో తనలో టీడీపీ బ్లడ్ వచ్చేసిందంటూ చెప్పిన ఆయన.. చంద్రబాబు తనకు మొదట్నించి ముఖ్యుడు.. శ్రేయభిలాషి అంటూ జాగ్రత్తగా మాట్లాడటం గమనార్హం. తనకు తోచినట్లు మాట్లాడతానని.. అది తన మైండ్ సెట్ గా చెప్పుకొచ్చిన రాయపాటి.. టీడీపీ అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా.. తన నియోజకవర్గంలో మంచినీటి సౌకర్యం కల్పించలేదన్న బాధతో తాను కాస్త అసంతృప్తి వ్యక్తం చేసిన మాట వాస్తవమేనని చెప్పుకొచ్చారు.
తన గురించి చాలానే గొప్పలు చెప్పుకున్న రాయపాటి.. తమ అధినేత చంద్రబాబు గురించి గొప్పలు చెప్పే ప్రయత్నం చేశారు. బాబు రోజూ 18గంటలు కష్టపడుతుంటే.. తాను 10 గంటలు కూడా పని చేయలేకపోతున్నట్లు వాపోయిన ఆయన.. వయసు కారణంగా పని చేయలేకపోతున్నట్లు వెల్లడించారు. మొత్తానికి వయసు మీద పడిన విషయాన్ని రాయపాటి ఒప్పుకున్నారే.