పెద్దనోట్లకు మంగళం పాడేసిన మోడీ సర్కారు మరో కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ఇప్పటికిప్పుడు కాకున్నా.. చాలా త్వరగానే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న నోట్ల మొత్తాన్ని మార్చేయాలన్న ఆలోచనను బయటపెట్టింది. ఇప్పటికే రూ.500.. రూ.1000 నోట్లను రద్దు చేసి.. కొత్తగా రూ.2వేల నోట్లను అందుబాటులోకి తీసుకురావటం తెలిసిందే.
నల్లధనాన్ని అదుపు చేయటంతో పాటు.. నకిలీ మకిలీ లెక్క తేల్చటంతో పాటు.. అలాంటి వారి ఆటలు సాగకుండా ఉండేందుకు వీలుగా సరికొత్త షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న రూ.5.. 10..20..50..100 నోట్లను త్వరలో మార్కెట్ నుంచి ఉపసంహరించుకోనున్నట్లు కేంద్రం వెల్లడించింది. వీటి స్థానే సరికొత్త హంగులతో.. సెక్యూరిటీ సిస్టంతో ఉన్న నోట్లను తీసుకురావాలని భావిస్తున్నట్లుగా ఆర్థిక శాఖ ప్రకటించింది.
దేశంలోని కరెన్సీని సమూలంగా మార్చేయటంతో పాటు.. సరికొత్త సెక్యూరిటీ ఫీచర్లతో నకిలీ నగదుకు చెక్ చెప్పే లక్ష్యంతో కొత్త నోట్లను దశల వారీగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్థిక శాఖ వ్యవహారాల కార్యదర్శి శశికాంత్ దాస్ గుప్తా వెల్లడించారు. ఇప్పుడున్న అన్నీ నోట్లను ఉపసంహరించుకోనున్న విషయాన్ని ఆయన వెల్లడించారు. దీంతో.. చిన్ననోట్లను భారీగా దాచిపెట్టుకోవాలన్న ఆలోచనలు చేసే వారికి సైతం షాకిచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. రానున్న రోజుల్లో అంతా కొత్త నోట్లేనన్న మాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/