దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషించే రంగాల్లో రియల్ ఎస్టేట్ ఒకటి. మరి.. ఈ ఇండస్ట్రీలో తిరుగు లేని అధిక్యతను ప్రదర్శించేది ఎవరు? అన్న ప్రశ్నకు తాజాగా విడుదల చేసిన నివేదిక సమాధానాన్ని చెప్పేసింది. రియల్ రంగం లో అపర కుబేరుడిగా చెప్పే డీఎల్ఎఫ్ ఛైర్మన్ రాజీవ్ సింగ్ కు తొలిస్థానం దక్కింది. డిఎల్ఎఫ్ ఎపిసోడ్ లో ఆయన ఇమేజ్ మసకబారినప్పటికీ.. ఆ రంగంలో ఆయనకు మించిన తోపు మరొకరు లేదన్న విషయాన్ని స్పష్టమైంది.
రియల్ రంగంలో దేశంలోని 16 నగరాల్లోని 67 కంపెనీల కు చెందిన టాప్ 100 మంది శ్రీమంతుల కు సంబంధించిన జాబితాను తాజాగా గ్రహ్ - హురున్ ఇండియా 2023 జాబితాను విడుదల చేశారు. 2023 మార్చి నాటికి ఈ రంగానికి చెందిన సంపన్నుల ఆస్తుల్ని లెక్కేసి.. జాబితాను రూపొందించారు. ఇందులో మొదటిస్థానంలో డీఎల్ఎఫ్ ఛైర్మన్ రాజీవ్ సింగ్ రూ.59,030 కోట్ల నికర సంపదతో మొదటి స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో ముంబయి కేంద్రంగా రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు నిర్వహించే మాక్రోటెక్ డెవలపర్స్ కు చెందిన మంగళ్ ప్రభాత్ లోధా ఫ్యామిలీ రూ.42,270 కోట్ల సంపదతో రెండో స్థానంలో నిలిచారు.
మూడో స్థానంలో బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఆర్ ఎంజడ్ కార్ప్ నకు చెందిన అర్జున్ మెండా ఫ్యామిలీ రూ.37 వేల కోట్ల సంపదతో జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. వీరు తొలిసారి ఈ జాబితాలో చోటు చిక్కించుకోవటం.. టాప్ 5లో ఒకరిగా ఉండటంగా చెప్పాలి. నాలుగో స్థానంలో కె రహేజా సంస్థకు చెందిన చండ్రు రహేజా అండ్ ఫ్యామిలీ రూ.26,620 కోట్లుగా ఉంటే.. ఐదో స్థానంలో హీరానందన్ కమ్యూనిటీస్ కు చెందిన నిరంజన్ హీరానందానీ రూ.23,900 కోట్లతో నిలిచారు.
ఈ జాబితాలో టాప్ టెన్ లో తెలుగు రాష్ట్రాల కు చెందిన జీఏఆర్ కార్పొరేషన్ కు చెందిన గవ్వ అమరేందర్ రెడ్డి రూ.15వేల కోట్లతో పదో స్థానంలో నిలవగా.. హైదరాబాద్ కేంద్రంగా రియల్ రంగం అన్నంతనే గుర్తుకు వచ్చే హైహోం అధినేత జూపల్లి రామేశ్వరరావు ఆయన కుటుంబం రూ.9,490 కోట్లతో జాబితాలో పదమూడో స్థానంలో నిలవటం గమనార్హం.
ఇక.. దేశంలో సంపన్న కుటుంబాలుగా పేరున్న పిరమాల్ రియాల్టీని నిర్వహిస్తున్న అజయ్ పిరిమాల్ ఫ్యామిలీ జాబితాలో 18వ స్థానం (రూ.4870 కోట్లు)నిలవగా.. గోద్రోజ్ ప్రోపర్టీస్ కు చెందిన ఆది గోద్రెజ్ రూ.4200 కోట్లతో 23వ స్థానంలో నిలిచారు. జాబితాలో కొత్తగా చేరిన వారు పాతిక మంది అన్న విషయాన్ని చూసినప్పుడు రియల్ రంగం వర్థమాన వ్యాపారవేత్తల సంపదను ఎంత వేగంగా పెంచుతుందన్న విషయం అర్థమవుతుంది.
ఈ జాబితా ను చూస్తే.. మొదటి స్థానంలో నిలిచిన డీఎల్ఎఫ్ ఛైర్మన్ రాజీవ్ సింగ్ నికర సంపద ఏడాది కాలంలో నాలుగు శాతం తగ్గినా.. మొదటిస్థానంలోనే ఉండటం విశేషం. రాష్ట్రాల పరంగా చూస్తే.. టాప్ 100లో 37 మంది మహారాష్ట్ర నుంచి చోటు దక్కించుకోగా.. తర్వాత స్థానాల్లో 23 మందితో ఢిల్లీ.. 18 మందితో కర్ణాటక రాష్ట్రం నిలిచింది. వ్యక్తిగతంగా చూస్తే.. ఈ జాబితాలో అత్యధిక సంఖ్యలో ఉన్న రియల్ రంగ యజమానుల్లో దేశ ఆర్థిక రాజధానిగా చెప్పే ముంబయికి చెందిన 29 మంది ఉండగా.. ఢిల్లీకి చెందిన వారు 23 మంది.. బెంగళూరుకు చెందిన 18 మంది సంపన్నులు టాప్ త్రీలో నిలిచారు.
దేశంలోని మొత్తం 100 మంది రియల్ రంగ కుబేరుల వద్ద ఉన్న సంపద రూ.4,72,330 కోట్లు కాగా.. అందులో 60 శాతం మొదటి పది మంది వద్దే ఉండటం గమనార్హం.గత ఏడాదితో పోలిస్తే.. ఈసారి వీరి సంపద నాలుగు శాతం పెరిగినట్లుగా నివేదిక పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే.. టాప్ 100లో 61 మంది సంపద పెరిగింది. వీరిలో పాతిక మంది కొత్తగా జాబితాలో రాగా.. మరో 36 మంది సంపద గత ఏడాది కంటే తగ్గింది. రియల్ రంగంలో అత్యంత సంపన్న మహిళలుగా పియా సింగ్.. రేణుకా తల్వార్ (డీఎల్ఎఫ్) నిలిచారు.